టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ డీగ్రేడ్ కామెంట్స్ చేశారు. సెహ్వాగ్ తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువగానే తన దగ్గర డబ్బు ఉందంటూ  షోయబ్ అక్తర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన యూట్యూబ్ లో వీడియో కూడా విడుదల చేయడం గమనార్హం. అయితే.... 2016లో సెహ్వాగ్ తనపై చేసిన కామెంట్స్ కి.. షోయబ్ ఇప్పుడు బదులివ్వడం విశేషం.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... షోయబ్ కి డబ్బులు అవసరమని.. అందుకే భారత క్రికెటర్లను , భారత్ ను పొగుడుతున్నాడంటూ గతంలో ఎప్పుడో సెహ్వాగ్ కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ కి షోయబ్ తాజాగా కౌంటర్ ఇవ్వడం గమనార్హం. 

 

ఈ మేరకు యూట్యూబ్ లో వీడియోని కూడా పెట్టాడు. ఆ వీడియోలో "నా స్నేహితుడు సెహ్వాగ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతున్నాయి. డబ్బు, వ్యాపారం కోసమే అక్తర్‌ భారత క్రికెట్‌ గురించి మాట్లాడతాడని వ్యాఖ్యానించాడు. వీరూ భాయ్‌కు ఒక్కటే చెప్పదల్చుకున్నా. డబ్బు అనేది నాకు భారత్‌ ఇచ్చింది కాదు. ఆ భగవంతుడు ఇచ్చాడు" అని అన్నాడు.

Also Read ధోనీ రిటైర్మెంట్ పై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.

‘‘ నీ తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతకంటే ఎక్కువగా నా దగ్గర డబ్బు ఉంది. పదిహేను సంవత్సరాలపాటు పాక్ తరపున క్రికెడ్ ఆడాను. దాంతో నాకు పేరు, ప్రఖ్యాతలు, డబ్బులు సంపాదించుకోగలిగాను. ఇంకా డబ్బు కోసం నేను వెంపర్లాడటం లేదు.’’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు.

‘‘ తాను ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓడిపోయిన తర్వాత నా అభిప్రాయం చెప్పాను. సిరీస్ గెలిచాక మెచ్చుకున్నాను కూడా. అయినా కూడా భారత్ ఓడిపోయినప్పుడు నేను చేసిన కామెంట్లను మాత్రమే హైలెట్ చేశారు. ఆ కామెంట్స్ కి గతంలో సెహ్వాగ్ చేసిన కామెంట్స్ ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నాకు సెహ్వాగ్ పై ఎలాంటి కోపం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం’’ అని షోయబ్ పేర్కొన్నాడు.