మౌంట్ మాంగనూయ్: తన జట్టు సహచరుడు శ్రేయస్ అయ్యర్ ను హత్తుకుని ఉన్న తన ఫొటోను టీమిండియా ఆటగాడు యుజువేంద్ర చాహల్ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. దానికి "గాట్ ఆల్వేస్ యువర్ బ్యాక్" అనే శీర్షికను తగిలించాడు. దానికి రోహిత్ శర్మ స్పందిస్తూ "ముందు నీ వీపుని నువ్వు చూసుకో" అంటూ ఆట పట్టించే ప్రయత్నం చేశాడు.

దానికి చాహాల్ ప్రతిస్పందిస్తూ.. "భయ్యా నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నన్ను మిస్సవుతున్నావని నాకు తెలుసు. అంతగా ఈర్ష్య పడకు. త్వరలోనే కలిసి నీతో ఫొటో దిగుతాను కదా" అని అన్నాడు. చాహాల్ ఇటీవల శ్రేయస్ అయ్యర్ తో కలిసి ఉన్న ఫొటోలను, వీడియోలను చాహల్ పోస్టు చేస్తూ వస్తున్నాడు. దాంతో రోహిత్ శర్మ ఆ విధంగా వ్యాఖ్యానించాడు.

గాయం కారణంగా రోహిత్ శర్మ న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. రోహిత్ శర్మకు, చాహాల్ కు మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్డివ్ గా ఉండే చాహాల్ వీలు దొరికినప్పుడల్లా రోహిత్ శర్మను ఆట పట్టిస్తూ ఉంటాడు. రోహిత్ శర్మ, అతని భార్య రితిక అదే స్థాయిలో సమాధానం ఇస్తూ ఉంటారు. 

సరదా కామెంట్లతో వారిద్దరు చాహల్ ను ట్రోల్ చేస్తూ ఉంటారు. తాజాగా రోహిత్ శర్మ చాహల్ శ్రేయస్ అయ్యర్ ను హత్తుకుని ఉన్న ఫొటోపై రోహిత్ శర్మ కామెంట్ చేశాడు. దానికి చాహల్ సరదాగా బదులిచ్చాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.