బూస్టర్ డోసు ఎప్పుడు వేసుకోవాలి..? ఐసీఎంఆర్ ఏం చెప్పిదంటే..?
బూస్టర్ డోసు ఎప్పుడు వేసుకోవాలన్న దానిపై ఐసీఎంఆర్ క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం కేంద్ర పార్లమెంటరీ కమిటీకి ఐసీఎంఆర్ బూస్టర్ డోసులపై పలు సూచనలు చేసింది.
ఓమ్రికాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయాంభ్రాంతులకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో భయటపడ్డ ఈ కొత్త వేరియంట్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇండియాలో మొట్ట మొదటి సారిగా కర్నాకటలోని బెంగళూరులో ఈ ఓమ్రికాన్ పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఓమ్రికాన్ పాజిటివ్ కేసులు దేశంలో 32కు చేరుకున్నాయి. ఓమ్రికాన్ విస్తరించకుండా చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
9 నెలల తరువాతే బూస్టర్..
కరోనా కొత్త వేరియంట్ తన పరిధి పెంచుకుంటూపోతోంది. అలాగే ఇప్పడు దేశంలో డెల్టా వేరియంట్ కేసులు కూడా పెరుతున్నాయి. ఈ కేసులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయని తాజా నివేధికలు చెబుతున్నాయి. కేరళలో మొన్న ఒకే రోజు కరోనా వల్ల 35 మంది చనిపోయారు. అలాగే ఢిల్లీలో ఒకరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ బూస్టర్ డోసుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. బూస్టర్ డోసు తీసుకోవడం వల్ల యాంటీబాడీలు పెరిగి కొత్త వేరియంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బూస్టర్ డోసు అంటే ఏమిటీ ? ఎందుకు బూస్టర్ డోసు వేసుకోవాలి ? ఎప్పుడు వేసుకోవాలి ? రెండో డోసు వేసుకున్న ఎన్ని రోజులకు బూస్టర్ డోసు వేసుకోవాలనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసే విధంగా ఐసీఎంఆర్ కేంద్రానికి పలు సూచనలు, సలహాలు అందించింది. రెండో డోసు వేసుకొని 9 నెలలు పూర్తయిన తరువాత బూస్టర్ డోసు వేసుకోవచ్చని తెలిపింది. బూస్టర్ డోసుగా కోవిషీల్డ్‌ను వేసుకోవచ్చని తెలిపారు. కోవిషీల్డ్‌ను బూస్టర్ డోసుగా ఇస్తే యాంటీబాడీలు పెరిగి కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఇటీవల ఐసీఎంఆర్ తెలిపింది. ఓమ్రికాన్ వల్ల ఇప్పటి వరకు హెల్త్ డిపార్ట్ మెంట్ పై ఒత్తిడి పడలేదని ఐసీఎంఆర్ అధికారి భార్గవ తెలిపారు. అనవవసరంగా కొత్త వేరియంట్‌పై మీడియా భయాందోళనకు గురి చేసేలా కథనాలు ప్రచురించవద్దని ఆయన కోరారు.
వ్యాక్సిన్ తీసుకుంటేనే థియేటర్ లోకి ఎంట్రీ.. ఎక్కడంటే ?
కోవిషీల్డ్‌కు బూస్టర్ డోస్ గా అనుమతి..
కరోనా వ్యాక్సిన్లలో ఒకటైన కోవిషీల్డ్‌కు బూస్టర్ డోసుగా డీసీజీఐ ఇటీవలే అనుమతి ఇచ్చింది. ఓమ్రికాన్ విస్తరిస్తుండటం, డెల్టా వేరియంట్ కేసులు కూడా పెరుగుతుండటంతో ప్రజల్లో బూస్టర్ డోసు చర్చ నడుస్తోంది. దీంతో కోవిషీల్డ్‌కు బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాని తయారీ సంస్థ సీరం డీసీజీఐకి గత నెల చివరిలో దరఖాస్తు చేసుకుంది. తమ వద్ద ప్రజలకు బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అవసరమైన స్టాక్ రెడీగా ఉందని తెలిపారు. కోవిషీల్డ్ బూస్టర్ డోసుగా పని చేస్తుందని తెలిపారు. సీరం కంపెనీ చేసుకున్న దరఖాస్తుకు ఈ నెల మొదటి వారంలో డీసీజీఐ ఆమోదం లభించింది. బూస్టర్ డోసుగా కోవిషీల్డ్ ఇవ్వవచ్చని తెలిపింది.