వ్యాక్సిన్ తీసుకుంటేనే థియేటర్ లోకి ఎంట్రీ.. ఎక్కడంటే ?

కరోనా కట్టకి అధికార యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది. అందులో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తోంది.  ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకుంటేనే సినిమా థియేటర్ లోకి అనుమతి ఇస్తామని తమిళనాడులోని తిరుత్తణి కలెక్టర్ తెలిపారు. 

Entry into the theater only if vaccinated .. Where?

కోవిడ్ క‌ట్ట‌డికి దేశంలోని అన్ని రాష్ట్రాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఓమ్రికాన్ వేరియంట్ విస్త‌రిస్తోంద‌న్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అలెర్ట్ అయ్యాయి. క‌రోనాను విజృంభించ‌కుండా చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్నారు. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన ఓమ్రికాన్ వేరియంట్ ఇత‌ర దేశాల‌కు విస్త‌రిస్తోంది. ఇప్పుడు ఇది  ఇండియాలోకి కూడా ప్ర‌వేశించింది. ఇప్ప‌టి వ‌ర‌క ప్రభుత్వ అధికారిక లెక్క‌ల ప్రకారం ఓమ్రికాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరింది. క‌ర్నాట‌క‌లోని బెంగ‌ళూరులో మొద‌టి కేసులు భ‌య‌ట‌ప‌డ్డాయి. ఇప్పుడున్న ఓమ్రికాన్ పాజిటివ్ కేసుల్లో రాజ‌స్థాన్‌లో నుంచే అత్య‌ధికంగా ఉన్నాయి. ఈ ఓమ్రికాన్ కేసులు ఇండియాలోకి ప్ర‌వేశించ‌క ముందే కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల‌ను అలెర్ట్ చేసింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రుల‌తో, ముఖ్య అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి మాట్లాడారు. ఓమ్రికాన్ ముప్పు పొంచి ఉన్నందున జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించారు. క‌రోనా క‌ట్ట‌డికి అవ‌స‌ర‌మైన అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లూ తీసుకోవాల‌ని ఆదేశించారు. దీంతో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి..

వ్యాక్సిన్, మాస్క్ మ‌స్ట్‌.. లేకుంటే నో ఎంట్రీ..
ఓమ్రికాన్ వేరియంటే కాక.. డెల్టా వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఇటీవ‌ల కేసుల పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం. అందుకే అన్ని రాష్ట్రాలు క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు వేగ‌వంతం చేశాయి. మాస్క్‌, వ్యాక్సిన్ మ‌స్ట్ అనే నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తెచ్చాయి. మాస్క్ లేకుండే జ‌రినామా వేస్తాయ‌ని చెబుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ మ‌రో అడుగు ముందుకేసి మాస్క్ లేకుంటే ప్ర‌యాణం చేయ‌నివ్వ‌బోమ‌ని చెప్పింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నాయి. 

ఇండియా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను గుర్తించిన 108 దేశాలు

వ్యాక్సిన్ వేసుకోలేదా ? సినిమాకు రావొద్దు..
క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా వివిధ రాష్ట్రాలు వివిధ ప‌ద్ద‌తుల‌ను అమ‌లు చేస్తున్నాయి. అందులో భాగంగానే త‌మిళ‌నాడులోని తిరుత్త‌ణి క‌లెక్ట‌ర్ ఓ కొత్త రూల్ పెట్టారు. వ్యాక్సిన్ వేసుకుంటేనే సినిమా థియేట‌ర్ల‌లోకి అనుమ‌తిస్తామ‌ని క‌లెక్ట‌ర్ ఆల్పీ జాన్ వ‌ర్గీస్ ప్ర‌క‌టించారు. ఆ జిల్లాలోని టాకీస్ ల వ‌ద్ద శుక్ర‌వారం క‌రోనా వ్యాక్సినేష‌న్ క్యాంపుల‌ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ కొత్త నిబంధ‌న‌ను భ‌య‌ట‌పెట్టారు. అధికార యంత్రాంగం క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం వ‌ల్లే క‌రోనా అదుపులో ఉంద‌ని చెప్పారు. తిరుత్త‌ణి జిల్లాలో 80 శాతం ప్ర‌జ‌లు వ్యాక్సిన్‌లు వేసుకున్నార‌ని, ఇంకా ఇర‌వై శాతం ప్ర‌జ‌లు వ్యాక్సిన్ వేసుకోలేద‌ని అన్నారు. వారికి వ్యాక్సిన్ అందించేందుకే ఇలాంటి కొత్త రూల్ తీసుకురావాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. థియేట‌ర్ల‌తో పాటు రద్దీగా ఉండే బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్ల లో కూడా వ్యాక్సినేష‌న్ క్యాంపుల‌ను పెడుతున్నామ‌ని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకున్న వారినే సినిమా చూసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని థియేట‌ర్ నిర్వాహ‌కుల‌ను ఆదేశించారు. తెలంగాణ‌లో కూడా ఇలాంటి రూల్స్ కొన్ని అమ‌లు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోక‌పోతే రేష‌న్ ఇవ్వ‌బోమ‌ని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప‌లు రేష‌న్ షాపుల్లో ఇప్ప‌టికే ఇది అమ‌లు చేస్తున్నారు. అలాగే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాక‌రించిన వారి ఇళ్ల‌కు క‌రెంట్ స‌ర‌ఫ‌రాను క‌ట్ చేశారు. త‌రువాత వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు స‌మ్మ‌తిస్తేనే క‌రెంట్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌రించారు. టెస్కాబ్ సంస్థ వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ ఉంటేనే జీతాలు ఇస్తామ‌ని వారి ఉద్యోగుల‌కు ఆదేశాలు జారీ చేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios