Omicron India: భార‌త్ అప్ర‌మ‌త్తం.. నెగెటివ్ వచ్చినా.. క్వారంటైన్ తప్పనిసరి.. పాజిటివ్ వ‌స్తే..

గత వారం దక్షిణాఫ్రికాలో గుర్తించడానికి ముందే ఒమిక్రాన్ ప్రపంచ దేశాలలో బాగా వ్యాపించి ఉందని డేటా చూపిస్తోంది. ఈ క్ర‌మంలో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తమైంది. విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణీకుల‌పై అంక్షాల‌ను విధించింది. 
 

Omicron central government tightens Covid rules for passengers

Omicron India: క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచ  దేశాల‌ను ఏవిధంగా గ‌జ‌గ‌జ వ‌ణికించిందో అంద‌రికీ తెలిసిన‌ విష‌య‌మే. లక్షలాది మంది ఈ మ‌హమ్మారి బారిన ప‌డ్డారు వేలాది సంఖ్య‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇప్పుడు ఈ వైర‌స్ మ‌రో కొత్త‌ రూపం దాల్చింది. అదే ఒమిక్రాన్  వేరియంట్.. ఆఫ్రికా లో వెలుగులోకి వ‌చ్చినా ఈ వైర‌స్ చాప కింద నీరులా ప్ర‌వ‌హిస్తోంది. క్ర‌మంగా.. ఆసియా, యురేపియన్, అమెరికా ఖండాల‌కు వ్యాపించింది. ఇప్ప‌టికే దాదాపు 20 దేశాలలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకూ భారత్ లో అధికారికంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు.. కానీ , ఈ వేరియంట్ భార‌త్ లో అడుగు పెట్టి ఉండోచ్చు అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

ఇదిలా ఉంటే..  యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన భూభాగం ఐరోపా మరియు జపాన్‌తో సహా డజన్ల‌ దేశాలలో ఓమిక్రాన్ వ్యాప్తించిన‌ట్టు అధికారికంగా  ప్ర‌కటించారు. అలాగే ఈ వారం జర్మనీ, ఇటలీ, మొజాంబిక్,  నెదర్లాండ్స్,  దక్షిణాఫ్రికా ల్లో 61 మందికి ఈ వేరియంట్ ల‌క్ష‌ణాలు ఉన్నట్టు నిర్థారణ అయ్యింది.  ఇక ఆసియాలో ఇజ్రాయిల్‌, జపాన్ దేశాల్లో ఈ వేరియంట్ బయటపడటంతో మిగతా దేశాలు అప్రమత్తమ‌వుతున్నాయి.

https://telugu.asianetnews.com/national/covshield-can-be-taken-as-a-booster-dose-dcgi-approved-r3hao8

ఈ క్ర‌మంలో భారత ప్ర‌భుత్వం అప్ర‌మత్త‌మైంది. ఒమిక్రాన్ పై ముందస్తు చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్  ను కట్టడి చేయడానికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. విమానాశ్రయాలు దగ్గర కరోనా టెస్టులను పెంచింది. ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చి, కరోనా వైరస్ బారిన పడ్డ వారు చాలామంది ఉన్నారు. బాధితుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు. రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

 ఇత‌ర దేశాల నుంచి ఎవరు వచ్చినా.. కరోనా ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా చేసింది భార‌త్ స‌ర్కార్. ఇత‌ర‌ దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలను విధించింది. ప్ర‌తి ప్ర‌యాణీకుడు క‌రోనా నిబంధనల‌ను పాటించాల్సి ఉంటుంది. అలాగే..  ప్ర‌తి ప్ర‌యాణీకుడు త‌న‌ డిక్లరేషన్ ఫామ్‌ను విమానాశ్రయంలో అధికారులకు అందజేయాల‌ని తెలిపింది. అలాగే.. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను సువిధ యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని ప్ర‌భుత్వం పేర్కొంది.  

https://telugu.asianetnews.com/international/omicron-warning-from-south-african-scientists-r3hanq

ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే ప్రయాణీకుల‌కు ఎయిర్ పోర్ట్స్ లోనే వేరియంట్ నిర్థార‌ణ ప‌రిక్ష‌లను త‌ప్ప‌ని సరి చేసింది భార‌త్ స‌ర్కార్. ఈ ప‌రీక్ష‌ల్లో  కోవిడ్ నెగెటివ్ వచ్చినా స‌రే.. 14 రోజులు పాటు  హోమ్ క్వారంటైన్ ఉండాలని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా ఈ ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ అని వ‌స్తే..  వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించాల‌నీ. స‌ద‌రు బాధితులను క్వారంటైన్ లో ఉంచాల‌ని, అంతే కాకుండా..  14 రోజుల ట్రావెల్ హిస్టరీని తప్పనిసరిగా విమానాశ్రయం అధికారులకు అందజేయాలి.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios