కోవిడ్ -19 ముగిసిందా? ఒమిక్రాన్ ఎక్స్ బీబీ సబ్ వేరియెంట్ పై డబ్ల్యుహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ ఏం అన్నారంటే ?

ఒమిక్రాన్ ఎక్స్ బీబీ సబ్ వేరియెంట్ వల్ల త్వరలో మరి కొన్ని దేశాల్లో కరోనా వేవ్స్ సంభవించే అవకాశం దని బ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కోవిడ్ పై నిరంతరం నిఘా కొనసాగాలని ఆమె సూచించారు.

Is Covid-19 over? What did WHO Chief Scientist say about Omicron X BB sub variant?

కోవిడ్-19 వైరస్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఎక్స్ బీబీ సబ్ వేరియెంట్ తో కొన్ని దేశాల్లో మరొక వేవ్ ఇన్ఫెక్షన్లను చూసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గురువారం చెప్పారు. ‘‘ ఒమిక్రాన్ కు 300కు పైగా సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆందోళన చెందుతున్నది ఎక్స్ బిబి అని నేను అనుకుంటున్నాను. ఇది రీకాంబినెంట్ వైరస్. మేము ఇంతకు ముందు కొన్ని రీకాంబినెంట్ వైరస్లను చూశాం. అయితే ఇది అధిక రోగనిరోధక-తప్పించుకుంటుంది.  అంటే ఇది ప్రతిరోధకాలను అధిగమించగలదు. ఎక్స్ బీబీ కారణంగా కొన్ని దేశాల్లో మరో వేవ్ ఇన్ఫెక్షన్లను మనం చూడచ్చు ’’ అని స్వామినాథన్ అన్నారు.

‘భారతంలో శ్రీ కృష్ణుడు జిహాద్‌ పాఠాలు బోధించాడు’- కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు

కోవిడ్ కొత్త వేరియంట్లు ప్రస్తుత వేరియంట్ల కంటే తీవ్రంగా ఉన్నాయని సూచించడానికి ఏ దేశం నుండి డేటా లేదని స్వామినాథన్ అన్నారు.  అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వైరస్  బీఏ.5,  బీఏ.1 వేరియంట్లను ట్రాక్ చేస్తోందని డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త తెలిపారు. ఒమిక్రాన్ ఎక్స్ బీబీ సబ్ వేరియెంట్ పై తాజా నివేదికలు కోవిడ్-19లో తాజా పరిణామాలు, కోవిడ్ అనంతర ప్రపంచంలో సవాళ్లకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తాయని చెప్పారు. 

నకలు చిట్టీని లవ్ లెటర్‌గా పొరబడిన బాలిక.. అబ్బాయిని చంపేసిన ఆమె సోదరులు

కోవిడ్ వైరస్ ను పర్యవేక్షించి ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని స్వామి నాథన్ నొక్కి చెప్పారు. ‘‘ మనం కోవిడ్ వైరస్ ను పర్యవేక్షించడం, ట్రాక్ చేయడం కొనసాగించాలి. అనేక దేశాలలో పరీక్షలు తగ్గుముఖం పట్టాయని, గత కొన్ని నెలలుగా జన్యుపరమైన నిఘా కూడా తగ్గిందని మాకు సమాచారం ఉంది. జన్యు నిఘా కనీసం వ్యూహాత్మక నమూనాను మేము నిర్వహించాల్సిన అవసరం ఉంది. ’’ అని ఆమె అన్నారని వార్తా సంస్థ ‘పీటీఐ’ తెలిపింది.  కోవిడ్-19 అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా కొనసాగుతోందని స్వామినాథన్ చెప్పారు. 

యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం
ఇదిలా ఉండగా.. ఇప్ప‌టికే అమెరికాతో పాటు  ప‌లు దేశాల్లో గుర్తించిన అతి ప్రమాద‌క‌రైనదిగా పేర్కొన్న క‌రోనా స‌బ్ వేరియంట్ బీక్యూ.1, బిక్యూ.1.1 వేరియంట్లను భార‌త్ లో కూగా గుర్తించారు. అయితే ఇప్పటివ‌ర‌కు దేశంలో చాలా వేరియంట్లు వెలుగులోకి వ‌చ్చినా పెద్ద‌గా ప్ర‌మాదం చూపలేదు. కానీ ఇప్పుడు గుర్తించిన ఈ వేరియంట్లు అతి ప్ర‌మాద‌ర‌మైన‌వి... ఎందుకంటే, అమెరికాలోని యాక్టివ్ కేసుల్లో 10 శాతానికి పైగా ఈ వేరియంట్ల‌కు చెందిన‌వి కావ‌డం ఆందోళ‌న కలిగిస్తోంది. మ‌హారాష్ట్రలో ఈ కొత్త వేరియంట్ల‌ను గుర్తించారు. క‌రోనా సోకిన  పూణే నివాసి న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ సమయంలో భారతదేశంలో మొట్టమొదటి ఓమిక్రాన్ కోవిడ్-19 సబ్‌వేరియంట్ BQ.1 కేసు కనుగొనబడిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ గత సోమవారం పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios