క‌రోనా క‌ల్లోలం.. చైనాలో రెండేళ్ల త‌రువాత అధిక కేసులు.. యూకేలో 5 మిలియ‌న్ల మందికి కోవిడ్

పలు దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చైనా, యూకే, దక్షిణ కొరియా వంటి దేశాల్లో అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. యూకేలో కొత్తగా మరో వేరియంట్ వెలుగులోకి వచ్చింది. చైనాలో కూడా కోవిడ్ - 19 కేసులు పెరుగుతున్నాయి. 

highest number of cases in China after two years..covid 5 million people in UK

ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తోంది. ప‌లు దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత వారంలో యునైటెడ్ కింగ్‌డమ్ ‘లివింగ్ విత్ కోవిడ్’ వ్యూహాన్నిరూపొందించి అమ‌లు చేస్తోంది. దీంతో ఇన్‌ఫెక్షన్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గ‌డిచిన రెండేళ్ల‌తో పోలిస్తే ప్ర‌స్తుతం చైనాలో అత్య‌ధిక కేసులు న‌మోదు అయ్యాయి. ఈ కేసుల పెరుగుద‌ల ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు 489.4 మిలియన్లను దాటేశాయి. మరణాలు 6.14 మిలియన్లకు పైగా పెరిగాయి. ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ క‌రోనా వైర‌స్ కొత్త జాతిని గుర్తించింది. ఇది మ‌రింత వేగంగా వ్యాపించే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. 

యునైటెడ్ కింగ్‌డమ్
కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌లు రికార్డు స్థాయికి చేరుకోవడంతో బ్రిటన్‌లో రోగులు హాస్పిటల్ లో చేరిక‌లు, మరణాల రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. మార్చి 26వ తేదీ నాటికి దాదాపు 4.9 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ తాజా వేవ్ కు వేగంగా వ్యాపించే ఓమిక్రాన్ వేరియంట్ BA.2 కారణమైంది. ఇది ప్ర‌స్తుతం UK అంతటా ఆధిపత్యం చెలాయిస్తోంది. 

చైనా
వేగంగా వ్యాప్తిచెందే Omicron వేరియంట్ చైనా అంతటా తన స్వీప్‌ను కొనసాగిస్తోంది. ఈ దేశంలో ఆదివారం ఒక్క‌రోజే 13,146 కోవిడ్ కేసులను నివేదించింది. ఇది రెండేళ్ల క్రితం వ‌చ్చిన మొదటి వేవ్ గరిష్ట స్థాయి కంటే అత్య‌ధికం. ఇందులో ఫైనాన్షియల్ హబ్ షాంఘైలో 70 శాతం కేసులు నమోదయ్యాయి. దాదాపు 25 మిలియన్ల మంది ప్ర‌జ‌లు కఠినమైన జీరో కోవిడ్ స్ట్రాటజీ అదేశాల ప్ర‌కారం ఇంట్లోనే ఉంటున్నారు. 

దక్షిణ కొరియా
దక్షిణ కొరియా శనివారం 264,171 కొత్త కోవిడ్ కేసులను నమోదు చేసింది. ఇక్క‌డ ఒమిక్రాన్ వేరియంట్ మందగిస్తోంది. రెండో రోజు వరుసగా 300,000 మార్కు కంటే తక్కువగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కోవిడ్ ఆంక్షలను సడలిలించింది. అన్ని దేశాల నుండి పూర్తి స్థాయి వ్యాక్సిన్ లు వేసుకున్న ప్రయాణికులను క్వారంటైన్ లేకుండా దేశంలోకి అనుమతించాలని అక్క‌డి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే దేశంలోకి ప్ర‌వేశించాలంటే క‌రోనా టెస్ట్ క‌చ్చితంగా చేసుకోవాలి. ఇందులో నెగెటివ్ వ‌స్తేనే ప్ర‌వేశాన్ని అనుమ‌తిస్తారు. 

క‌ల‌వ‌ర‌పెడుతున్న కొత్త వేరియంట్..
Omicron వేరియంట్ కొత్త జాతి క‌ల‌వ‌ర‌పెడుతోంది. దీనిని మొద‌ట UKలో కనుగొన్నారు. దీనిని XE గా పిలుస్తున్నారు. ఇది కరోనా వైరస్ పాత వేరియంట్ల కంటే ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతుందని WHO తెలిపింది. BA.2 వేరియంట్‌తో పోలిస్తే XE రీకాంబినెంట్ (BA.1-BA.2) కమ్యూనిటీ వృద్ధి రేటు అధికంగా ఉంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. అయితే ఈ డేటాను ధృవీకరించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.

కోవాక్సిన్ సరఫరా నిలిపివేత‌..
మ‌న దేశంలో  మొట్ట మొద‌టి స్వ‌దేశీ కోవిడ్-19 వ్యాక్సిన్, భార‌త్ బ‌యోటిక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ స‌ర‌ఫ‌రాను UNO ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీల ద్వారా WHO నిలిపివేసింది. టీకాను స్వీకరించిన దేశాలకు తగిన చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. అయితే టీకా ప్రభావవంతంగా ఉంద‌ని, ఎలాంటి భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు లేవ‌ని స్ప‌ష్టం చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios