ఒమిక్రాన్ కేసుల్లో ఢిల్లీ టాప్.. నేటి నుంచే అమల్లోకి నైట్ కర్ఫ్యూ
ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రం కోవిడ్ ఆంక్షలు కఠినతరం చేసింది. ఈ రోజు నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఎమెర్జన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది.
దేశంలో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. ఈ నెల ప్రారంభంలో దేశంలో తొలి రెండు కేసులను గుర్తించగా ఇప్పుడు ఆ సంఖ్య 400కు పైగా చేరుకుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. కరోనాను అదుపులోకి తెచ్చేందుకు కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నాయి. మన దేశంలో ఒమిక్రాన్ కేసుల్లో ఢిల్లీ టాప్‌లో ఉంది. అందుకే ఆ రాష్ట్రం ఆంక్షలను కఠినతరం చేశాయి. ఇప్పటికే క్రిస్మస్ వేడుకలను అనుమతించలేదు. అలాగే న్యూయర్ వేడుకలు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కలిసి ఢిల్లీలో 290 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈరోజు నుంచి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పిల్లల్లో కోవాగ్జిన్ మెరుగ్గా పని చేస్తుంది - ఎన్‌టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్ కే ఆరోరా
రాత్రి 11 నుంచి 5 గంటల వరకు.. వీటికే మినహాయింపు..
నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకురానుంది. ఇది రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉండనుంది. అయితే నైట్ నైట్ కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. స్థానికంగా ఉండే దుకాణాల నుంచి సరుకులు, కూరగాయలు పాలు, ఇంటికి అవసరమయ్యే ఇతర అవసరాల కోసం కాలినడకన వెళ్లే వారికి మినహాయింపు ఇచ్చారు. అలాగే ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ల నుంచి, బస్టాప్‌లకు వెళ్లే వారికి, ఆ ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే వారికి మినహాయింపు ఇచ్చారు. అయితే వారు అక్కడి నుంచి వస్తున్నట్టు ధృవీకరించుకోవాలి. అంటే టికెట్ లేదా బోర్డింగ్ పాస్ వంటివి అడిగినప్పుడు చూపించాల్సి ఉంటుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసే జర్నలిస్టులకు మినహాయింపు ఉంటుంది. ఫుడ్, మెడిసిన్, ఇతర ట్రీట్‌మెంట్ కు సంబంధించిన వస్తువులు డెలివరీలు చేసే వ్యక్తులను మినహాయించారు.
మొదటగా బూస్టర్ డోసులు అందుకునేది వీళ్లే.. 20 రకాల్లో ఏ వ్యాధి ఉన్నాబూస్టర్ డోసు !
24 గంటల్లో 37 శాతం పెరిగిన కేసులు..
ఒమిక్రాన్ కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే ఈ కొత్త వేరియంట్ కేసులు 37 శాతం పెరిగాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో 422 కేసులు నమోదవ్వగా, సోమావారం వెల్లడించిన డేటా ప్రకారం ఆ కేసులు 578 కు పెరిగాయి. ఇంతలా పెరుగుదల ఉండటం ఆందోళన కలిగించే విషయం. దేశంలో మహారాష్ట్ర (141), కేరళ (57), గుజరాత్ (49), రాజస్థాన్ (43) నమోదయ్యాయి. మొత్తం మీద దేశంలో గత 24 గంటల్లో 6,531 ఇతర కోవిడ్ కోవిడ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు రాత్రి నుంచి కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో ముందడుగు వేసింది. ఫ్రంట్‌లైన్ కార్మికులకు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వనుంది. జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు వేయనుంది.