కరోనా లక్షణాలతో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్  పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలోని ఐసీయూ కి తరలించారు. నిన్న సాధారణ పరీక్షల కోసం అని చెప్పి ఆసుపత్రిలో చేర్పించిన అధికార వర్గాలు, ఆయన పరిస్థితి పూర్తిగా దిగజారడంతో, వైద్యుల సలహా మేరకు ఐసీయూలోకి షిఫ్ట్ చేసారు. 

వారం రోజుల క్రితం బ్రిటన్ ప్రధానమంత్రి  కరోనా పాజిటివ్ లక్షణాలతో తన గృహంలోనే క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు ఆయన సహచరి కి కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి.(వీరికి వివాహం కాలేదు, సహజీవనం చేస్తున్నారు) ఆమె మాత్రం గర్భంతో ఉన్నప్పటికీ చాలా త్వరగా ఈ లక్షణాల నుండి కోలుకున్నట్టు తెలిపారు.  

బోరిస్ జాన్సన్ ఇప్పటివరకు తన అధికారిక బాధ్యతలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహిస్తూ వస్తున్నారు. మిగిలిన మంత్రివర్గ సహచరులందరికీ తన సలహాలు సూచనలు ఇస్తూ, ఇసోలాటిన్ లో ఉన్నప్పటికీ కరోనా వైరస్ మృత్యు గటికలు మోగిస్తున్న వేళ ముందుండి నడిపించాడు. ఇప్పుడు తాను ఐసీయూలోకి షిఫ్ట్ అయిపోవడంతో విదేశాంగ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ ఇప్పుడు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు బోరిస్ జాన్సన్ స్థానంలో బాధ్యతలను చేపట్టాడు. 

ఇక ప్రధాని పరిస్థితి ఇలా ఉండడంతో ప్రపంచ దేశాధినేతలు, బ్రిటన్ ప్రజలు, సెలెబ్రిటీలు ఆయన త్వరగా కోలుకోవాలని సందేశాలను సోషల్ మీడియా వేదికగా పంపుతున్నారు. 

 బ్రిటన్ ప్రధాని క్వారంటైన్ లో చికిత్స తీసుకొంటున్నప్పటికీ ఇంకా వైరస్ లక్షణాలు తగ్గలేదు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు అధికారులు.  బ్రిటన్ ప్రధాని హోం క్వారంటైన్ నుండి  శుక్రవారం నుండే బయటకు రావాల్సి ఉంది కానీ, ఆయనకు జ్వరం తగ్గలేదు. కరోనా లక్షణాలు ఇంకా అలాగే ఉన్నాయి.

కరోనా లక్షణాలు తగ్గని కారణంగా ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించినట్టుగా  అధికారులు ప్రకటించారు. కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆసుపత్రిలో చేరానని తాను మాత్రం ఆరోగ్యంగానే ఉన్నానని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. 

కరోనా లక్షణాలు తగ్గేవరకు క్వారంటైన్ లో ఉంటూ తాను పనిచేస్తానని ఆయన ప్రకటించారు. బ్రిటన్  లో 47,806 మందికి కరోనా సోకింది. వీరిలో 4934 మంది మరణించారు.  బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ కూడ కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నాడు. ఆయన భార్యకు మాత్రం కరోనా లక్షణాలు లేవు. బ్రిటన్ రాణి ఎలిజబెత్  10 రోజుల క్రితమే హోం క్వారంటైన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.