కరోనా ఎఫెక్ట్: డబ్ల్యుహెచ్ఓపై ట్రంప్ సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విషయంలో డబ్ల్యు హెచ్ఓ తమను తప్పుదారి పట్టించిందన్నారు.ఈ సంస్థకు నిధులను నిలిపివేస్తామని కూడ ఆయన హెచ్చరించారు.
 

Trump threatens to freeze funding for World Health Organization

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విషయంలో డబ్ల్యు హెచ్ఓ తమను తప్పుదారి పట్టించిందన్నారు.ఈ సంస్థకు నిధులను నిలిపివేస్తామని కూడ ఆయన హెచ్చరించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నుండే ఎక్కువగా నిధులు అందుతున్న విషయాన్ని మంగళవారం నాడు  ఆయన గుర్తు చేశారు. డబ్యుహెచ్ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. 

కరోనా వైరస్ విషయం వెలుగు చూసిన తర్వాత తొలినాళ్లలో దాని ప్రమాదంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద సమాచారం ఉన్నా కూడ దాన్ని పంచుకోవడానికి నిరాకరించినట్టుగా ట్రంప్ గుర్తు చేశారు.

ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకొన్న నిర్ణయాలపై అగ్రరాజ్యాధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆ దేశ ప్రయాణాలపై నిషేధం విధిస్తే దాన్ని డబ్ల్యు హెచ్ ఓ వ్యతిరేకించిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు.

కరోనా పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తున్న తీరుపై సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటి చైర్మెన్ జిమ్ రిష్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయమై డబ్ల్యుహెచ్ఓ పై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించారు.  అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలను డబ్లుహెచ్ఓ తప్పుదారి పట్టించిందని ఆయన ఆరోపించారు.

డబ్లుహెచ్ఓ చీఫ్ గా  టెడ్రోన్ అధనోమ్ రాజీనామా చేసే వరకు కూడ అమెరికా నుండి ఈ సంస్థకు అందే నిధులను నిలిపివేయాలని అమెరికాలోని ఉభయపక్షాలకు చెందిన చట్టసభల ప్రతినిధుల బృందం తీర్మానం చేశాయి.

also read:కరోనా మరణాల్లో న్యూయార్క్ రికార్డ్.. 24గంటల్లో 731మంది

కరోనా ఎదుర్కొనేందుకు అమెరికా సర్కార్ ఏర్పాటు చేసిన 2.2 ట్రిలియన్ డాలర్ల నిధిని పర్యవేక్షిస్తున్న ఇన్స్‌పెక్టర్ జనరల్ ను ట్రంప్ విధుల నుండి తొలగించారు. కరోనా విషయంలో ఆసుపత్రులను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. ట్రంప్ అభిశంసనను  ఇన్స్ పెక్టర్ జనరల్ సమర్ధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను ఈ విధుల నుండి తప్పించడం ప్రస్తుతం వివాదానికి కారణంగా మారింది.

అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజూ వందలాది మంది మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios