సౌదీలో తొలి కరోనా మరణం... ప్రభుత్వం అలర్ట్
ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ సర్కార్ అన్నీ చర్యలు చేపట్టింది. 21 రోజుల పాటు కర్ఫ్యూ, అంతర్జాతీయ విమానాల రాకపోకల నిలిపివేత, మసీదులు, స్కూల్స్, మాల్స్, రెస్టారెంట్స్‌లను మూసివేసింది. అలాగే ఉమ్రా తీర్థయాత్రను ఏడాది పొడవునా రద్దు చేసింది.
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 15వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4లక్షల మందికిపైగా వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్నారు. కాగా... తాజాగా ఈ వైరస్ గల్ఫ్ దేశాలకు కూడా పాకేసింది.
గల్ఫ్ దేశాలను కరోనా(కొవిడ్-19)వైరస్ కలవరపరుస్తోంది. ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అక్కడి జనం భయంతో వణికిపోతున్నారు. సౌదీలో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం దేశ ప్రజలను భయపెడుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 762 మంది ఈ మహమ్మారి బారినపడగా, మంగళవారం తొలి మరణం నమోదైంది.
Also Read బ్రేకింగ్... చైనాలో మరో మహమ్మారి, హంటావైరస్ తో ఒకరి మృతి...
కరోనావైరస్ సోకిన ఆఫ్గనిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి(51) చికిత్స పొందుతూ చనిపోయినట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహమ్మద్ అబ్దేలాలి ప్రకటించారు. సోమవారం రాత్రి మదీనాలోని ఆస్పత్రిలో కరోనా బారినపడి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో మరణించాడని అబ్దేలాలి పేర్కొన్నారు.
ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ సర్కార్ అన్నీ చర్యలు చేపట్టింది. 21 రోజుల పాటు కర్ఫ్యూ, అంతర్జాతీయ విమానాల రాకపోకల నిలిపివేత, మసీదులు, స్కూల్స్, మాల్స్, రెస్టారెంట్స్‌లను మూసివేసింది. అలాగే ఉమ్రా తీర్థయాత్రను ఏడాది పొడవునా రద్దు చేసింది.
కాగా, గల్ఫ్ కోఆర్డినేషన్ కౌన్సిల్(జీసీసీ)లో ఇప్పటి వరకు మొత్తం 2,100 మందికి కరోనా సోకింది. వీరిలో అధికంగా సౌదీ, ఖతార్‌కు చెందిన వారు ఉన్నారు. జీసీసీలో మొత్తం ఆరు మరణాలు సంభవించాయి. బహ్రెయిన్-3, యూఏఈ-2, సౌదీ-1. కువైత్ కూడా ఈ మహమ్మారి విస్తరణను నిలువరించే క్రమంలో కర్ఫ్యూ విధించింది. తాజాగా ఈ కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించిన ఆరుగురు ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు కువైత్ అధికారులు తెలియజేశారు.