వాషింగ్టన్: కరోనాతో ప్రఖ్యాత చెఫ్ ప్లాయిడ్ కార్డోజ్ మృతి చెందాడు. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఈ నెల 18వ తేదీ నుండి ఆయన ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలోనే ఆయన బుధవారం నాడు మృతి చెందాడు.

కరోనా పాజిటివ్ లక్షణాలు ఉండడంతో  ఫ్లాయిడ్ కార్డోజ్  న్యూజెర్సీలోని మౌంటేడ్న్‌సైడ్ మెడికల్  సెంటర్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే కార్డోజ్ మృతి చెందిన విషయాన్ని కార్డోజ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న హంగర్ ఐఎన్ సీ సంస్థ ధృవీకరించింది. 

ALSO READ:డిల్లీలో డాక్టర్ కుటుంబానికి కరోనా పాజిటివ్ లక్షణాలు

బయో కెమిస్ట్‌గా తొలుత ఫ్లాయిడ్ శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆయన చెఫ్ గా మారాడు. వంటలపై తనకు చిన్నప్పటి నుండి ఉన్న అభిరుచి మేరకు ఆయన చెఫ్ గా మారాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చెఫ్ గా ఆయన ఇండియాతో పాటు స్విట్జర్లాండ్ లో ఆయన శిక్షణ పొందాడు. ఆ తర్వాత ఆయన న్యూయార్క్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు. 

వంటల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్నాడు ప్లాయిడ్. టాప్ చెఫ్ మాస్టర్ టైటిల్ ను కూడ ఆయన దక్కించుకొన్నాడు. దీంతో ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఫ్లాయిడ్ మృతి పట్ల  ఇండియాకు చెందిన ప్రముఖ చెఫ్ పద్మలక్ష్మి సంతాపం వ్యక్తం చేశారు. 

కరోనా వైరస్ అమెరికాలో రోజు రోజు విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ, కొత్తగా నమోదౌతున్న కేసులు కానీ మరణాల సంఖ్య కానీ తగ్గడం లేదు.  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తోంది. ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో ఈ వైరస్ కారణంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. అమెరికాలో కూడ మృతుల సంఖ్య పాజిటివ్ కేసుల సంఖ్య కూడ పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది.