Asianet News TeluguAsianet News Telugu

చెదురుతున్న ఇండియన్స్ డాలర్‌డ్రీమ్స్‌.. 5 లక్షల కొలువులు హుష్ కాకి?!

చైనాలో పుట్టిన కరోనా వైరస్.. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆటాడుకుంటున్నది. దీనివల్ల అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి సుమారు ఐదు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కనిపిస్తున్నది. 

Indians Face Job Threat in US
Author
New Delhi, First Published Apr 3, 2020, 8:47 AM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అగ్ర రాజ్యం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఒకవైపు భారీగా ప్రాణ నష్టం జరుగుతుంటే మరోవైపు ఆర్థిక మాంద్యం చాపకింద నీరులా విస్తరిస్తున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం రావడంతో భారీగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది.

ఇది హెచ్‌-1బీ వీసాతో  పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు శాపంగా మారింది. నష్టాలను పూడ్చుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం, హెచ్-‌1బీ వీసా కల ఉద్యోగులనే ముందుగా సంస్థల యాజమాన్యాలు తొలగిస్తామని ప్రకటించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. 

ఏతావాతా భారతీయుల డాలర్ కలలు కరోనా దెబ్బకు చెదిరిపోతున్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతే నిర్ణీత 60 రోజుల్లో మరొక ఉద్యోగం పొందలేమని, తిరిగి స్వదేశాలకు వెళ్లలేక రోడ్డున పడతామని అమెరికాలోని భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైట్‌హౌజ్‌ స్పందన కోరు తూ పిటిషన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించారు. 

హెచ్‌-1బీ వీసాల ద్వారా నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో చేర్చుకునేందుకు అమెరికా కంపెనీలకు వీలు కలుగుతుంది. దీని ప్రకారం భారీగా భారతీయులు అమెరికాలో పని చేస్తున్నారు. ఏటా హెచ్‌-1 బీ వీసా పొందుతున్న వారిలో 67 నుంచి 72 శాతం భారతీయులే. అయితే కరోనా వైరస్‌ వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి.

ముఖ్యంగా అమెరికాలో కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతుండటంతో ఆ దేశం భీకరంగా నష్టపోతున్నది. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగాల్లో కోత ప్రారంభించగా, మరికొన్ని కంపెనీలు ముం దు జాగ్రత్తతో నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు కొలువులను తొలగిస్తున్నాయి. దీంతో ఈ ప్రతికూల ప్రభావం హెచ్‌1-బీ వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారిపై పడనుంది. 

ప్రస్తుత ఫెడరల్‌ నిబంధన ప్రకారం, ఒకవేళ వీరిలో ఎవరు ఉద్యోగం కోల్పోయినా అమెరికాలో కేవలం 60 రోజులు మాత్రమే ఉండగలరు. తర్వాత వారి కుటుంబ సభ్యులతో సహా స్వదేశానికి తిరిగి రావాల్సిందే. అయితే ఈ కష్టకాలంలో తమను ఆదుకోవాలని అక్కడి విదేశీ ఐటీ నిపుణులు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గడువును 60 నుంచి 180కి పెంచాలని కోరుతున్నారు. 

అమెరికాలో కరోనా రోజురోజుకీ విస్తరిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. యూఎస్‌లో ఇప్పటికే లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారంటున్నారు. దాదాపు 35 లక్షల మంది ఇప్పటివరకు జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

ఒక అంచనా ప్రకారం 67 మిలియన్ల అమెరికన్ల ఉద్యోగాలు హై రిస్క్‌లో ఉన్నాయని, దాదాపు 47 మిలియన్ల (4.7కోట్లు) మంది నిరుద్యోగులుగా మారొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో దేశంలో నిరుద్యోగ రేటు రికార్డు స్థాయి లో 32 శాతానికి చేరుతుంద ని అమెరికా ప్రభు త్వ నిపుణులు అంచనా వేస్తున్నా రు. గడిచిన వందేండ్ల లో అమెరికా ఇంతటి ఆర్థిక దుస్థితిని ఎదుర్కోకపోవడం గమనార్హం.

హెచ్‌-1-బీ వీసాతో ఉన్న వారు నిరుద్యోగ ప్రయోజనాలకు అర్హులు కారు. ఈ ప్రయోజనం కోసం వారి జీతం నుంచి తగ్గింపులు ఉన్నా వారు సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందలేరని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో హెచ్‌1బీ వీసాదారులు ఉద్యోగాలు కోల్పోతే తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. 

వేరే ఉద్యోగాలు వెతుక్కోవడం అసాధ్యమైన పని. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో స్వదేశాలకు తిరిగి వెళ్లడం సాధ్యపడదు. కాబట్టి ఒకవేళ ఉద్యోగాలు కోల్పోతే ఉండేందుకు ఉన్న 60 రోజుల గడువును 180 రోజులకు పెంచాలని కోరుతున్నారు. 

ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు కరోనా వైరస్‌ రూపంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఎమ్మెస్సీ చదువడానికి అమెరికా వెళ్లిన దీపక్‌ పరిస్థితి మరి అధ్వాన్యంగా తయారైంది.

ఇక్కడ బ్యాంకు వద్ద లక్షల రూపాయలు రుణం తీసుకొని ఎంచక్క అమెరికాకు వెళ్లి అక్కడ ఎమ్మెస్సీతోపాటు పార్ట్‌టైం ఉద్యోగం చేసి తను తీసుకున్న బ్యాంక్‌ రుణం తీర్చివేయాలని ఎంతో ఆశతో అమెరికా ఫ్లైట్‌ ఎక్కిన వారి ఆశలకు కరోనా వైరస్‌ గండికొట్టింది. చదువు మాట దేవుడు ఎరుగు..ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

అటు పార్ట్‌టైం ఉద్యోగం పోయి, ఇటు తిండి లేక బయటకు వెళ్లుదామంటే ఎక్కడి నుంచి కరోనా వైరస్‌ చుట్టుకుంటుందోనని భయాల మధ్య కాలం గడుపుతున్నారు. తెలుగు రాష్ర్టాలతోపాటు భారత్‌ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడి ఐటీ, ఇతర ఉద్యోగాలు, ఉన్నత కోర్సులు అభ్యసిస్తున్న ప్రతివారి పరిస్థితి ఇది. 

ప్రస్తుతం అక్కడి నిబంధనల ప్రకారం వారానికి 8 గంటల నుంచి 12 గంటల వరకు పార్ట్‌టైం ఉద్యోగం చేసుకునే వీలుంటుంది.  అమెరికాలో దాదాపు 35 లక్షల మంది ఇప్పటి వరకు జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

ఒక అంచనా ప్రకారం, 67 మిలియన్ల అమెరికన్ల ఉద్యోగాలు హై రిస్క్‌లో ఉన్నాయి. ఇందులో దాదాపు 4.7కోట్లు మంది నిరుద్యోగులుగా మారొచ్చని అంచనా. అమెరికా నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో 32శాతానికి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఏటా హెచ్‌-1బీ పొందుతున్న వారిలో 67 నుంచి 72% భారతీయులే. అయితే కరోనా వైరస్‌ వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు స్తంభించాయి. ముఖ్యంగా అమెరికా కంపెనీలు ముందు జాగ్రత్తతో నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios