అమెరికాలో ఉన్న తెలుగు మహిళ తన స్వీయానుభవాలను, స్వీయ భావనలను పంపించారు. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి స్థితిలో తాను ఎలా ఫీలవుతున్నానే విషయాన్ని ఈసియా నెట్ న్యూస్ తో పంచుకున్నారు. 

ఇంటి నుంచి వర్క్ చేయడం ప్రారంభించి రెండు వారాలవుతోంది. అమెరికాలో 85,594 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 1,300 మంది మరణించారు. రెండు వారాల్లో చాలా నేర్చుకున్నా. జీవించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. నేను చేసేది సోషల్ సర్వీస్ కాబట్టి ఎప్పుడూ బిజీగా ఉంటుంది. 

ఇక్కడ పని మనుషులు ఉండరు. ఇంటి నుంచే టీమ్ వర్క్ చేయాలి. జీవితంలో కొన్ని పాజిటివ్ ఇన్ పుట్స్ తీసుకుంటున్నాను. రెసిషన్ ఆందోళన కలిగిస్తోంది. కొంత మంది ఇప్పటికే జాబ్స్ కోల్పోయారు. పిల్లల బడి గురించి ఆందోళనగా ఉంది. బడులు ఆరు నెలలు మూసేశారు. మంచి విషయం ఏమిటంటే, వారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. గూగుల్ క్లాస్ రూమ్స్ ద్వారా టీచర్స్ సపోర్టు చేస్తున్నారు.

ఇదో కొత్త అనుభవం. అయితే, సోషల్ డిస్టాన్స్ విచారం కలిగిస్తోంది. ఈ కాన్సెప్ట్ రోబోట్స్ మాదిరిగా ఉంది.అది ప్రజలను దూరం చేస్తుంది. ఇప్పటికే చాలా మంది ఒంటరివాళ్లం అయిపోయామనే భావనకు గురయ్యారు. మరిన్ని సోషల్ కోచింగ్ సెంటర్ల అవసరం ఉంది. పిల్లలు కంప్యూటర్స్ కు అతుక్కుపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. పనిచేసిన తర్వాత పిల్లలతో గడపడానికి సమయం వెతుక్కోవాల్సి వస్తోంది. 

- లత (పేరు మార్చడం జరిగింది)
అమెరికా నుంచి....

వర్క్ ఎట్ హోం స్థితిలో మీ అనుభవాలను, ఫీలింగ్స్ ను మాతో పంచుకోండి. కొంత ఊరట లభిస్తుంది. మీ అనుభవాలను pratapreddy@asianetnews.in అనే మెయిల్ కు పంపించండి. లేదా 09848956375 అనే నెంబర్ కు వాట్సప్ చేయండి.