కరోనా వైరస్: ఒకసారి కోలుకున్న వ్యక్తికి మళ్ళీ వస్తుందా...?

మహమ్మారి మసూచి కూడా ఒకసారి సోకినవారికి మరలా సోకకపోయేది. ఇప్పుడు ఈ కరోనా ను కూడా ఇదే గాటున కట్టేశారు ఇన్ని రోజులు అందరూ. కానీ పరిశోధనలు, వాస్తవాలు వేరే విషయాన్నీ చెబుతున్నాయి. 

Coronavirus: Can a person be infected Twice...?

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ చుట్టూనే తిరుగుతుంది. ఈ దేశం ఆ దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాలకు ఇప్పుడు ఇదే సమస్యగా పరిణమించింది. ప్రపంచం మొత్తానికి ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలో పాలుపోని సంకట స్థితి. 

ఈ వైరస్ కొత్తది అవడం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్ పై విస్తృత స్థాయిలో ప్రయోగాలు పరిశోధనలు చేస్తున్నాయి. మందు కనిపెట్టే విషయంలో అన్ని దేశాలు నిమగ్నమయి ఉన్నాయి. 

ఇకపోతే ఇప్పటివరకు వైరస్ ఒక్కసారి వచ్చిన తరువాత మరల రాదు అని చాలా మంది అనుకునే వారు. ఫ్లూ, జలుబు ఇతర వైరస్ వల్ల వచ్చే జబ్బులు మరల అంత త్వరగా రావు అనుకునే వారు. 

also read:డిల్లీలో డాక్టర్ కుటుంబానికి కరోనా పాజిటివ్ లక్షణాలు  

మన దేశం నుండి వెళ్ళిపోయిన మహమ్మారి మసూచి కూడా ఒకసారి సోకినవారికి మరలా సోకకపోయేది. ఇప్పుడు ఈ కరోనా ను కూడా ఇదే గాటున కట్టేశారు ఇన్ని రోజులు అందరూ. కానీ పరిశోధనలు, వాస్తవాలు వేరే విషయాన్నీ చెబుతున్నాయి. 

జపాన్ లో వెలుగుచూసిన ఒక కేసు ఈ దిశగా అందరి దృష్టిని మరల్చింది. 70 సంవత్సరాలున్న ఒక వ్యక్తి తొలుత కరోనా తో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అతనికి చికిత్స అందించిన తరువాత అతను ఆసుపత్రి నుండి వెళ్ళిపోయాడు. 

సాధారణ జీవితం గడుపుతూ రైళ్లలో తిరిగాడు, మెట్రోలు ఎక్కాడు ఫంక్షన్స్ కి కూడా వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత జ్వరం వచ్చిందని మరల ఆసుపత్రికి వెళితే... కరోనా మరల వచ్చిందని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. 

ఈ ఒక్క కేసు అనుకుంటే పొరపాటే... ఆ తరువాత కరోనా వచ్చి తగ్గినవారిపై కూడా నిఘా పెట్టారు. అందరికి ఇలా తిరగబెట్టకున్నప్పటికీ.... కొంతమందిలో మాత్రం ఈ వైరస్ లక్షణాలు తిరిగి కనబడుతున్నాయి. ఆ సంఖ్య కూడా తక్కువగా ఏమి లేదు. కరోనా నుంచి కోలుకున్నవారిలో 14 శాతం మంది ఈ వైరస్ బారిన మరల పడుతున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. 

ఇలా వైరస్ బారిన మరల ఎందుకు పడుతున్నారు అని పరిశోధన చేయగా వీరంతా వైరస్ బారిన మరల పాడడం లేదని... అంతకు ముందు వంట్లో ఉన్న వైరస్ మరల తిరగబెడుతోందని తేలింది. 

సాధారణంగా వైరస్ నుంచి కోలుకున్న తరువాత మనిషి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  ఈ వైరస్ తగ్గక కూడా మనిషి పుంజుకోగానే మనిషి రోగ నిరోధక శక్తి పెరిగినట్టే. సాధారణముగా వైరస్ మూడు నెలల పాటు శరీరంలో దాక్కొని ఉండగలదు. 

అలా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఈ వైరస్ లక్షణాలు మరల  ప్రాథమికంగా తెలియవస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్నవారిలో మాత్రం ఈ వైరస్ మరల తిరగబెట్టే ఆస్కారం అంతలా ఉండడం లేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios