పాక్ ని మోసం చేసిన చైనా, లో దుస్తులతో చేసిన మాస్కులను పంపిన వైనం, వీడియో వైరల్

తాజాగా చైనా తన మిత్రుడు పాకిస్తాన్ కు ఎన్-95  మాస్కులు పంపిస్తానని హామీ ఇచ్చిందట. చెప్పినట్టే మాస్కులను పంపించింది. కాకపోతే అవి లోదుస్తులతోని తయారు చేసినవాని పాకిస్తాన్ లోని పలువురు ఆరోపిస్తున్నారు. 

China cheats its all weather friend pak by sending masks made of under garments instead of N-95 ones

కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్ తో సహా అన్ని దేశాలు ఈ వైరస్ ని ఎలా ఎదురుకోవాలో అర్థంకాక సోషల్ డిస్టెంసింగ్ మీదనే భారం వేశారు. 

అన్ని దేశాల పరిస్థితి ఇలా ఉంటె... చైనా మాత్రం ఆ కరోనా మహమ్మారి నుండి కోలుకొని అక్కడ ఇప్పుడు ఏకంగా పరిశ్రమల్లో ఉత్పత్తి కూడా ప్రారంభమయింది. అన్ని దేశాలు లాక్ డౌన్ లో ఉండి ఉత్పత్తిని ఆపేస్తే... ఇప్పుడు చైనా ఉత్పత్తిలో దోసుకుపోతుంది. కార్ల నుంచి ఆసుపత్రుల పరికరాల వరకు అన్నిటిని తయారు చేస్తుంది. 

ఇలా తాజాగా చైనా తన మిత్రుడు పాకిస్తాన్ కు ఎన్-95  మాస్కులు పంపిస్తానని హామీ ఇచ్చిందట. చెప్పినట్టే మాస్కులను పంపించింది. కాకపోతే అవి లోదుస్తులతోని తయారు చేసినవాని పాకిస్తాన్ లోని పలువురు ఆరోపిస్తున్నారు. 

దీనిపై భారత దేశంలోని వివిధ న్యూస్ ఛానల్ లు కూడా కథనాలు ప్రచురించాయి. భారత ఆర్మీ మేజర్(రిటైర్డ్) గౌరవ్ ఆర్య ఇందుకు సంబంధించిన ఒక పాకిస్తానీ టీవీ ఛానల్ క్లిప్పింగ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసాడు. 

అందులో చైనా మోసం చేసింది అని ఆ సదరు న్యూస్ ఛానల్ యాంకర్ అనడం మనం స్పష్టంగా వినొచ్చు. ఇలా నాణ్యత లేని చీప్ ప్రొడక్ట్స్ పంపడం ఏమిటని పలువురు పాకిస్తానీ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

ఇకపోతే భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  గత 24 గంటల్లో భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం 3188 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇందులో 229 మంది కోలుకున్నారు. కాగా, మృతుల సంఖ్య 94కు చేరుకుంది. గత 24 గంటల్లో 12 మంది మరణించగా,  కొత్తగా 601 కేసులు నమోదయ్యాయి.

శనివారం ఉదయం నాటికి గత 12 గంటల్లో కొత్తగా 355 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం 2902 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 68కి చేరుకుంది. ఇప్పటి వరకు 229 మంది కోలుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియా సమావేశంలో ఆ వివరాలు అందించారు.

కాగా, శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 478 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 2,547కు చేరుకుంది. ఇందులో 157 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 62 మంది మరణించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 68కి చేరుకుంది.

మహరాష్ట్రలో అత్యధికంగా 400కుపైగా కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానం తమిళనాడు ఆక్రమించింది. తమిళనాడులో 309 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. కేరళలో 286 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఢిల్లీలో 219 కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 172 కేసులు నిర్ధారణ కాగా, ఇద్దరు మరణించారు. 

ఏప్రిల్ 3వ తేదీనాటికి తబ్లిగి జమాత్ కు సంబంధించినవే 647 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా 1,097,909 కేసులు నమోదు కాగా, వందలాది దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అమెరికా, ఇటలీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అమెరికాలో 276,995 కేసులు నమోదు కాగా, ఇటలీలో 119,827 కేసులు నమోదయ్యాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios