ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ కరోనా ని అరికట్టాలనే ఉద్దేశంతో దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. అయితే.. ఈ లాక్ డౌన్ గడువు మరింత పొడిగించే అవకాశం కనిపిస్తోంది. లాక్ డౌన్ లో పెట్టినప్పటికీ.. కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతుండటం అందరినీ కలవర పరుస్తోంది.

Also Read ఏడు సెకన్లు పట్టదు.. బయటకొస్తే కాల్చిపడేస్తా: పోలీస్ అధికారి వార్నింగ్...

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు వివిధ రాష్ట్రాలకు ఇన్చార్జులుగా నియమితులైన కేంద్ర మంత్రులు పలు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ లతో ప్రత్యక్ష సంప్రదింపులు జరుపుతున్నారు. కలెక్టర్లందరూ  ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల స్థితిగతుల గురించి సమాచారం సేకరంచాలని  సూచించారు. అదే సమయంలో ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం లాక్ డౌన్  గడువును  మరింత పొడిగించవచ్చని తెలుస్తోంది. 

వైరస్ సంక్రమణ బారిన పడిన రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర మంత్రులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రభుత్వ సిబ్బంది గ్రామాల్లో రోగుల గురించి తెసుసుకుంటున్నారు. నగరాల నుంచి గ్రామానికి చేరుకున్న వారిపై కన్ను వేస్తున్నారు. 

మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యలపై రోజువారీ నివేదిక ఇవ్వాలని పిఎంఓ కేంద్ర మంత్రులను ఆదేశించింది. కాగా దేశంలో  కరోనా వైరస్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 75 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 724 కు పెరిగింది. కరోనా  వైరస్ కారణంగా  మరణించిన వారి సంఖ్య 17  కు చేరుకుంది.