కరోనా నుంచి కోలుకున్న రోగుల రక్తంతో వ్యాక్సిన్...?
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారు దానం చేసిన రక్తంలోని ప్లాస్మా(జీవద్రవ్యం) ద్వారా చికిత్స చేయడం అన్నమాట. ఈ విధానంపై భారీ స్థాయిలో అధ్యయనం చేయడానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతుల కోసం అక్కడి ఆస్పత్రులు ఎదురుచూస్తున్నాయి.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 3లక్షల మందికిపైగా ఈ వైరస్ సోకి ఇబ్బంది పడుతున్నారు. అయితే.. దీనికి వ్యాక్సిన్ కనుగొనేందుకు పలు దేశాల శాస్త్ర్రవేత్తలు కసరత్తులు చేస్తున్నారు.
అయితే.. చైనా ఓ వినూత్న పద్ధతి ద్వారా మందు కనిపెట్టాలని చూస్తుండటం గమనార్హం. కరోనా సోకి.. తర్వాత కోలుకున్న వారి రక్తం లోని ఫ్లాస్మా తీసి.. దాని ద్వారా చికిత్స అందించాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తుండటం గమనార్హం.
Also Read అమెరికాలో కరోనా విజృంభణ... చైనా అధ్యక్షుడితో మాట్లాడనున్న ట్రంప్...
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారు దానం చేసిన రక్తంలోని ప్లాస్మా(జీవద్రవ్యం) ద్వారా చికిత్స చేయడం అన్నమాట. ఈ విధానంపై భారీ స్థాయిలో అధ్యయనం చేయడానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతుల కోసం అక్కడి ఆస్పత్రులు ఎదురుచూస్తున్నాయి.
‘ఇది చేసే వరకు మాకేమీ తెలియదు. కానీ, చారిత్రక ఆధారాలు మాత్రం ప్రోత్సాహకరంగా ఉన్నాయి’ అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన డాక్టర్ అర్టురో కేసడ్‌వాల్ తెలిపారు. వ్యాధి నయమైన వారి రక్తాన్ని ఉపయోగించే పద్ధతికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ జెఫ్రీ హెండర్సన్ పేర్కొన్నారు.
ప్రత్యేక రోగ క్రిముల బారిన పడిన వ్యక్తి శరీరం.. వాటిపై పోరాడేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాంటీబాడీలుగా పిలిచే ప్రొటీన్లను తయారు చేయడం ప్రారంభిస్తుంది. ఆ వ్యక్తి కోలుకున్న తర్వాత ఆ యాంటీబాడీలు అతని రక్తంలో ప్రవహిస్తూనే ఉంటాయి.
ముఖ్యంగా ప్లాస్మాలో కొన్ని నెలలు, సంవత్సరాల పాటు వరకు అలాగే ఉంటాయి. యాంటీబాడీలతో కూడిన ఈ ప్లాస్మాను కొత్తగా కరోనా బారిన పడిన రోగుల శరీరంలోకి ఎక్కిస్తే వైర్‌సను ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తిని ఇస్తాయని వైద్యులు భావిస్తున్నారు. ఇది పనిచేస్తే.. రోగులు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా లేక శ్వాస యంత్రాల అవసరాన్ని తగ్గించగలుగుతాయా అన్న అంశాలను పరిశోధకులు నిర్ధారిస్తారు. అయితే ప్లాస్మాను ఎక్కించే విధానంలో అత్యంత అరుదుగా ఊపిరితిత్తులకు నష్టం కలిగే అవకాశం కూడా ఉండడం గమనార్హం.