కరోనా వైరస్ పంజా విసురుతున్న తరుణంలో ప్రపంచమంతా ఆ కంటికి కనిపించని క్రిమితో ఎదురుగా నిలబడి యుద్ధం చేయలేక ఆ వైరస్ తమ జోలికి రాకుండా ఉంటె చాలు అనుకుంటూ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఇలా లాక్ డౌన్ లో కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. 

ఈ కష్టకాలంలో కొందరు సాధారణ ప్రజల నుంచి నాయకుల వరకు ముందుండి ఈ కరోనా పై పోరులో ముందుండి నాయకత్వం వహిస్తున్నారు. కొందరు విరాళాలు ఇస్తుంటే, కొందరు ఆ సేకరించిన విరాళాలతో చాలామంది ఆకలి తీరుస్తున్నారు. ఇక కొందరు నాయకులు తమ ఊరిని రక్షించుకునేందుకు నడుం బిగించి అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. 

ఇలా కరోనాపై పోరులో ఆదర్శప్రాయంగా నిలుస్తున్న ఒక యువ మహిళా సర్పంచ్ ని మెచ్చుకుంటూ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. కరోనా పై యుద్ధంలో పారిశుధ్య కార్మికులతో కలిసి గ్రామంలో శానిటైజేషన్ పనుల్లో పాల్గొన్నారు. భుజానికి హైపోక్లోరితే ద్రావణం కలిపినా స్ప్రేయర్ తగిలించుకొని గ్రామంలోని అన్ని వీధులు తిరుగుతూ శానిటైజ్ చేసింది ఈ యువ సర్పంచ్. 

మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం గోపా తండాకు చెందిన ఈ సర్పంచ్ అజ్మీరా లక్ష్మి  అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా ప్రజల కోసం ఈ ఆపద సమయంలో కృషి చేస్తున్న వారందరిని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సిటిజెన్ హీరోస్ అని అందరికి పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే!

Also read:కరోనా మరణాల్లో న్యూయార్క్ రికార్డ్.. 24గంటల్లో 731మంది