మాస్కులు, శానిటైజెర్ల కోసం చందాలు అడుక్కుంటున్న తెలంగాణ జూనియర్ డాక్టర్లు
ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నప్పటికీ, ఈ మహమ్మారిపై యుద్ధంలో అన్ని అందిస్తున్నప్పటికీ ఇంకా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని, తమకు ఎన్-95 మాస్కుల దగ్గరి నుండి మొదలు శానిటైజెర్ల వరకు అన్నిటి కొరత ఉందని, ఇందుకోసం ప్రజలెవరైనా డాక్టర్లకు సహాయపడాలనుకుంటే తమ అకౌంట్లో డబ్బులు వేయొచ్చని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు.
కరోనా మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో తమ పరిస్థితి ఆయుధం లేని సైనికుడిలాగా అయిందని ఆవేదన చెందుతూ తెలంగాణలో జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కారు. గత నెలాఖరులో తమకు గనుక సరైన పిపిఈ సూట్లు ఇవ్వకుండా రోగులకు చికిత్స చేయమనడం సరికాదని వారు ఆరోపించారు.
మార్చ్ చివరలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయినా ఒక వ్యక్తి కరోనా తో చనిపోవడంతో అప్పటినుండి జూనియర్ డాక్టర్లు పిపిఈ కిట్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. కానీ అందరికి మాత్రం ఇవ్వడంలేదని వారు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నప్పటికీ, ఈ మహమ్మారిపై యుద్ధంలో అన్ని అందిస్తున్నప్పటికీ ఇంకా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని, తమకు ఎన్-95 మాస్కుల దగ్గరి నుండి మొదలు శానిటైజెర్ల వరకు అన్నిటి కొరత ఉందని, ఇందుకోసం ప్రజలెవరైనా డాక్టర్లకు సహాయపడాలనుకుంటే తమ అకౌంట్లో డబ్బులు వేయొచ్చని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు.
జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ... తమకు ప్రొటెక్టీవ్ గేర్ కొరత బాగా ఉందని, ఇలా గనుక అయితే తమ ప్రాణాలతో పాటు తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా ఆపదలో పడతాయని చెప్పుకొచ్చారు.
ఇలా ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్న సమయంలో డాక్టర్లు గనుక ఈ కరోనా వైరస్ బారిన పడితే ప్రజలను రక్షించేవారి కొరత ఏర్పడుతుందని ఆ లేఖలో వారు పేరుకున్నారు.
ప్రతి హెల్త్ వర్కర్ కి కనీస రక్షణ అయినా ఎన్-95 మాస్కు శానిటైజర్ అందించడానికి ఎవరైనా దాతలు ముందుకొచ్చి తమ అకౌంట్లో డబ్బులు వేయాలని కోరారు. ఆ అకౌంట్ లోని సొమ్ము వివరాలను, ఖర్చు వివరాలను పూర్తి పారదర్శకతతో మైంటైన్ చేస్తామని, సమకూర్చిన సామాగ్రికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తామని వారు అన్నారు.
డాక్టర్లకు అవసరమైన అన్ని కిట్లు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్నే ప్రెస్ మీట్లో చెప్పిన తరువాత నేడు ఇలా జూనియర్ డాక్టర్లు తమ ప్రాణాలకు రక్షణ లేదు, రక్షణ సామాగ్రి కొనుక్కోడానికి చానాదాలివ్వండి అని అడుక్కోవడం నిజంగా బాధాకరం.
ప్రభుత్వం వద్ద పిపిఈ కిట్లు ఉన్నాయనే మాట వాస్తవం. కానీ అవి ఇక్కడ డాక్టర్లకు చేరడంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి సమస్యపట్ల స్పందించి డాక్టర్లకు అవసరమైన పిపిఈ కిట్లను అందజేస్తే, ఈ కరోనా వైరస్ పై సాగిస్తున్నపోరులో మన కోసం ముందు వరుసలో నిలబడి యుద్ధం చేస్తున్న సైనికులను కాపాడుకున్నవారం అవుతాము.
ఈ కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్న సమయంలో యుద్ధం మధ్యలో డాక్టర్లు క్వారంటైన్ లో గనుక ఉండాల్సి వస్తే... అది సమాజానికి కాళరాత్రే అవుతుంది!