కరెంట్ లైట్లు ఆర్పేయాలన్న మోడీ: ముప్పు అంటున్న తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు

ప్రధాని నరేంద్ర మోడీ రేపు రాత్రి 9 గంటలకు ఇంట్లోని లైట్లనన్నిటిని కట్టేసి బాల్కనీలోకి కానీ గడప వద్ద కానీ నిలబడి దీపాలు వెలిగించమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు రాత్రి 9 గంటలకు ఇంట్లోని లైట్లనన్నిటిని కట్టేసి బాల్కనీలోకి కానీ గడప వద్ద కానీ నిలబడి దీపాలు వెలిగించమని చెప్పారు. 

Telangna Electrical Engineers foresee a threat in the wake of PM Modi's call to turn electric bulb's Off

కారొనపై పోరులో ఎవ్వరు ఒంటరిగా లేరు. అందరికీ అందరూ తోడుగా ఉన్నారు అనడానికి సంఘీభావ సూచకంగా ప్రధాని నరేంద్ర మోడీ రేపు రాత్రి 9 గంటలకు ఇంట్లోని లైట్లనన్నిటిని కట్టేసి బాల్కనీలోకి కానీ గడప వద్ద కానీ నిలబడి దీపాలు వెలిగించమని చెప్పారు. 

ఇలా ప్రధాని ఈ కరోనా పై పోరులో భాగంగా ప్రజలందరిలోను ఉత్సాహం నింపుతూ, మనమందరం కలిసి కట్టుగా ఉన్నామని చెప్పడానికి ఈ సంఘీభావ సూచకాన్ని పాటించమని కోరారు మోడీ గారు. 

కాకపోతే... ఇలా విద్యుత్ దీపాలను ఆర్పడం వల్ల ఇబ్బందులు కలగొచ్చని ఎలక్ట్రికల్ ఇంజినీర్లు ఒక విన్నపం చేస్తున్నారు. 

"5 న రాత్రి 9 గంటలకు దీపాలను వెలిగించాలని ప్రధాని పిలుపు ఇచ్ఛా రు. ఇలా చేస్తున్నప్పుడు, లైట్లు ఆపివేయమని ఆయన సూచించారు. కానీ, ఇప్పటికే, అన్ని పారిశ్రామిక మరియు వాణిజ్య లోడ్లు ఆఫ్‌లో ఉన్నందున, మాకు గ్రిడ్‌లో దేశీయ లోడ్లు మరియు అవసరమైన సేవల లోడ్లు మాత్రమే ఉన్నాయి. 

Also Read:కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంతో వైద్యం: వందేళ్ల నాటి విధానంతో అమెరికాలో ప్రయోగం

(ప్రస్తుత) లైటింగ్ లోడ్ మొత్తం లోడ్ కంటే 40% కన్నా తక్కువ కాబట్టి, గ్రిడ్‌లోని అన్ని లైట్ల ఆకస్మిక (ఏకకాలంలో) స్విచ్-ఆఫ్ చేయడం విద్యుత్తు కుప్పకూలిపోవచ్చు (భారీ లోడ్ అకస్మాత్తుగా పడిపోవడం).  కాబట్టి, దయచేసి, ఫ్రిజ్‌లు మరియు ఎసిలు వంటి కొన్ని లోడ్‌లను ఆన్‌లో ఉంచమని ప్రజలకు సలహా ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.  గ్రిడ్ కూలిపోతే, రోగులకు చికిత్స చేస్తున్న అన్ని ఆసుపత్రులు వారి క్లిష్టమైన విద్యుత్ సరఫరాను కోల్పోవచ్చు.  గ్రిడ్‌ను సేవ్ చేయడానికి దయచేసి అందరూ ఈ నియమాలను పాటించండి అని కోరారు."

ఇప్పటికే ఇలా గ్రిడ్ లకు ఇబ్బంది కలగొచ్చని ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ కొన్ని మార్గదర్శకాలని కూడా జారీ చేసింది. లోడ్ అంతా డౌన్ అయితే గ్రిడ్ షట్ డౌన్ కి దారి తీస్తుంది. ఉత్పత్తయిన విద్యుత్ ని పంపకం చేసినప్పుడు ఎవ్వరు వాడకపోతే గ్రిడ్ పూర్తిగా షట్ డౌన్ అవుతుంది. 

పోనీ వేరే గ్రిడ్ కయినా ట్రాన్స్ఫర్ చేద్దామా అంటే... దేశమంతా ఇలానే ఆఫ్ చేస్తారు అందువల్ల గ్రిడ్ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి మహారాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు ఇలా గనుక చేస్తే 15 నుంచి 16 గంటలపాటు గ్రిడ్ షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. 

ఒకే మారు లోడ్ ని తగ్గియలేరు. అది చేయాలాఅంటే... దాదాపుగా ఒక గంట ముందు నుంచే లోడ్ షెడ్డింగ్ ఆరంభించవలిసి ఉంటుంది. అంటే 8 గంటలా నుంచి నెమ్మది నెమ్మదిగా పవర్ కట్స్ మొదలుపెట్టాలి. 

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఫ్రీ గవర్నింగ్ మోడ్ లో ఉంచి విద్యుత్ ఉత్పాదనను సాధ్యమైనంత మేర తగ్గించమని చెప్పాలి. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 3000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పడిపోతుందని అంచనా. 

ఒక్క రాష్ట్రంలోనే ఇలా 3000 మెగావాట్ల అంటే... దేశం మొత్తంలో ఊహించవచ్చు. రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ బోర్డులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా కనీసం ఉదయం వరకు ఇళ్లలో కరెంటు ఉండదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios