ఈ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఫుల్ శాలరీ వేస్తామన్న తెలంగాణ సర్కార్
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు గాను పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. అందువల్ల కోత నుంచి వారికి మినహాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందువల్ల వారికి పూర్తి వేతనం చెల్లించనున్నారు.
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో ఆదాయం లేక రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఆర్ధిక పరిస్థితులు దిగజారిపోతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వోద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత విధించారు.
అయితే వైద్య, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బందికి మాత్రం ఈ విషయంలో మినహాయింపును ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు గాను పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు.
Also Read:ఉద్యోగుల జీతాల్లో కేసీఆర్ భారీ కోత: పొంచి ఉన్న ప్రమాదం ఇదే!
అందువల్ల కోత నుంచి వారికి మినహాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందువల్ల వారికి పూర్తి వేతనం చెల్లించనున్నారు.
కాగా ప్రస్తుత విపత్కర కాలంలో ముఖ్యమంత్రి, మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తూ గత సోమవారం రాత్రి తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Also Read:కేసీఆర్ బాటలో జగన్: ప్రభుత్వోద్యోగులకు రెండు విడతలుగా వేతనం
అదే సమయంలో ఐఏఎస్, ఐపీఎస్, ఎఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించారు. అలాగే అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం (నాలుగో తరగతి మినహా), నాలుగో తరగతి, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం చొప్పున కోత పడనుంది. అంతేకాకుండా అన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల ఫించన్లలో 50 శాతం, నాలుగో తరగతి ఉద్యోగుల ఫించన్లలో 10 శాతం కోత విధించనున్నారు.