Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కలకలం.. తాజాగా 3,603 కేసులు
Telangana Corona Cases: తెలంగాణ లో గడిచిన 24 గంటల్లో 93,397 శాంపిల్స్ పరీక్షించగా 3,603 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యారు. కరోనా మహమ్మారి ధాటికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,072కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,094 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య నానాటికి పైపైకి పోతుంది. ఈ క్రమంలో రోజువారి కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 93,397 శాంపిల్స్ పరీక్షించగా 3,603 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యారు. కరోనా మహమ్మారి ధాటికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,072కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,094 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో 1,421 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 308, రంగారెడ్డి జిల్లాలో 262, హనుమకొండ జిల్లాలో 150 కేసులు గుర్తించారు. వైరస్ పట్ల ప్రజలు అలసత్వం ప్రదర్శించవద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో 2,707 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ఇప్పటివరకు 7,34,815 పాజిటివ్ కేసులు నమోదు కాగా... మరో 32,094 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇటు ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 46,650 శాంపిల్స్‌ను పరీక్షించగా 14,440 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో అత్యధికంగా.. విశాఖ జిల్లాలో 2258 కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లాలో 1198 కేసులు, అనంతపురం జిల్లాలో 1534 కేసులు, గుంటూరు జిల్లాలో 1458 కేసులు, ప్రకాశం జిల్లాలో 1399 కేసులు నమోదనట్టు ఆర్యోగ నిపుణులు వెల్లడించారు. అలాగే.. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,969 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,82,482 మంది కరోనాను జయించారు.