ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు

 ఉమ్మడి మెదక్  జిల్లాలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించేందుకు అధికారులు రంగం సిద్దం చేశారు.

Six corona positive cases in Medak district

సంగారెడ్డి: ఉమ్మడి మెదక్  జిల్లాలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించేందుకు అధికారులు రంగం సిద్దం చేశారు.

ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన వారిని టెస్టు చేస్తే   గురువారం నాటికి ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం నాడు కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి హరీష్ రావు ఈ విషయాన్ని ప్రకటించారు.

Also read:సింగరేణి యాజమాన్యానికి కార్మిక సంఘాల నోటీస్: ఈ నెల 15 నుండి సమ్మె

ఉమ్మడి మెదక్ జిల్లా నుండి  సుమారు 28 మంది ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. వీరికి అధికారులు టెస్టులు నిర్వహిస్తే ఆరుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది.

ఈ ఆరుగురు కుటుంబసభ్యులను కూడ పరీక్షలు నిర్వహించారు. ఈ శాంపిల్స్ ను సీసీఎంబీకి తరలించారు. ఈ రిపోర్టులు శుక్రవారం నాడు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఆరుగురు కుటుంబాలకు చెందిన 43 మందిని కూడ హోం క్వారంటైన్ కు తరలించారు.మరో వైపు పాజిటివ్ లక్షణాలు ఉన్న వారి నుండి ఎవరెవరికి ఈ వైరస్ వ్యాప్తి చెందిందనే విషయమై ప్రత్యేక బృందం సమాచారాన్ని సేకరించనుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios