మోడీ చెప్పినా వినని రాజా సింగ్: కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, వీడియో వైరల్
తెలంగాణ ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నిన్న ప్రధాని మోడీ పిలుపుకు స్పందిస్తూనే ఆయన గీసిన సోషల్ డిస్టెంసింగ్ లక్ష్మణ రేఖను దాటాడు. దాదాపుగా ఒక 30 మంది గుంపును వెంటేసుకొని కాగడాలు పట్టుకొని వీధిలోకి వచ్చి గో బాసీజ్ గో బ్యాక్ చైనా వైరస్ గో బ్యాక్, చైనీస్ వైరస్ గో బ్యాక్ అని నినాదాలు చేసారు
ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న రాత్రి అందరినీ రాత్రి 9 గంటలకు లైట్లు కట్టేసి, 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించమని చెప్పారు. ఆయన పదే పదే లక్ష్మణ రేఖ గీస్తూ ఎవ్వరు ఇండ్లలోంచి బయటకు రావొద్దని, అందరూ సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించాలని కోరారు.
కానీ దేశమంతా ప్రజలు దీపాలు పెట్టమంటే దీపావళి చేసిన విషయం తెలిసిందే. ఏకంగా ర్యాలీలు కూడా తీశారు. కాగడాలు పట్టుకొని గో కరోనా అన్నట్టు అదేదో కరోనా ను అన్నట్టుగా జపం చేసారు.
ప్రజలు ఏదో తెలియక చేసారంటే అనుకోవచ్చు కానీ ఎమ్మెల్యేలు ఇలా చేయడం మరి విడ్డూరంగా ఉంది. తెలంగాణ ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నిన్న ప్రధాని మోడీ పిలుపుకు స్పందిస్తూనే ఆయన గీసిన సోషల్ డిస్టెంసింగ్ లక్ష్మణ రేఖను దాటాడు.
దాదాపుగా ఒక 30 మంది గుంపును వెంటేసుకొని కాగడాలు పట్టుకొని వీధిలోకి వచ్చి గో బాసీజ్ గో బ్యాక్ చైనా వైరస్ గో బ్యాక్, చైనీస్ వైరస్ గో బ్యాక్ అని నినాదాలు చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీని కింద నెటిజెలు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ... కరోనా ఎక్కడిదాకా వెళ్లిపోయింది అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. చైనా వైరస్ కాబట్టి చైనా భాషలో చెబితేది అంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు ప్రజలు. దీన్ని తెరాస నేత క్రిశాంక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది.