Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లాక్ డౌన్: కీలక నిర్ణయం, మొబైల్ నెంబర్లు ఇవీ....

కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కరీంనగర్ లో కీలక నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. కూరగాయలు ఇంటి వద్దకే వస్తాయని, అందుకు మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేశామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.

Mobile vegetable vans arranged at Karimanagar
Author
Karimnagar, First Published Apr 1, 2020, 6:06 PM IST

అమరావతి: కరీంనగర్‌లో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో నగరవాసులు ఎవరూ బయటకు రాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది ప్రజలు కూరగాయాల కోసం బయటకు వస్తుంటారు. అలాంటి వారి కోసం జిల్లాలో మొబైల్ రైతుబజార్లను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. 

ప్రస్తుతం నగరంలో 5 మొబైల్ రైతు బజార్లు అందుబాటులోకి వచ్చాయి. నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రజలకు కొంత సమయం కేటాయించినప్పటికి ప్రజల చేరువగా బజార్లు ఉంటే బయటకు వచ్చే వారి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. 

బుధవారం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గంగుల ఆ తర్వాత కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇండోనేషియా నుంచి వచ్చిన 10 మందితో పాటు, వారికి దగ్గరగా మెలిగిన ఓ కుటుంబంలోని ముగ్గురికి వైరస్ సోకిందని, వీరిని కలిసిన 80-90 మందిని క్వారంటైన్ కు పంపించినట్టు పేర్కొన్నార. ప్రజలందరూ ఇళ్లల్లో ఉంటే వైరస్ ప్రభావం తగ్గుతుందన్నారు. 

ఉపాధి కోల్పోయిన దినసరి కూలీలకు 12కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. బియ్యం పంపిణీ కోసం రూ. 1100 కోట్లు కేటాయించామని, వలస కూలీలకు కూడా బియ్యం అందిస్తున్నామన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులకు అందించిన టోకెన్‌ ద్వారా షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలని మంత్రి కోరారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద శానిటైజేషన్ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా    నగరపాలక సంస్థ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆగ్వర్యంలో మోబైల్ రైతు బజార్ పేరిట నగర ప్రజల కోసం మొబైల్ విజిటేబుల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. బుదవారం రోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ వై.సునిల్ రావు, కమీషనర్ వల్లూరు క్రాంతి, వ్యవసాయ మార్కెట్ డిడి పద్మావతి తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ మోబైల్ విజిటేబుల్ వాహానాలను ప్రారంభించారు. 

ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ... కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నగర ప్రజలకు మోబైల్ విజిటేబుల్ వాహానాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ ఆదేశాల ప్రకారం మరియు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలు ఇండ్ల నుండి బయటకు వెల్లకుండ ఇంటి వద్దకే కూరగాయు వచ్చే విధంగా ఈ వాహానాలు ఉపయోగ పడుతాయన్నారు. మొత్తం 5 వాహానాలను నగరంలోని పలు డివిజన్లు కేటాయించి ఉదయం పూట ఆ డివిజన్లలో పర్యటించే విధంగా నగరపాలక సంస్థ చర్యలు తీస్కుంటుదని తెలిపారు. 

మరో వైపు మేయర్ వై.సునిల్ రావు మాట్లాడుతూ.... రేపటి నుండి 1,2,9,31,33,39,58,59 వ డివిజన్లలో మొబైల్ వాహానాలు ప్రతి రోజు ఉదయం కూరగాయలతో పర్యటించడం జరుగుతుందన్నారు. కూరగాయలు అవసరం ఉన్న వారు  కూరగాయలను కొనుగోలు చేస్కోవాలని తెలిపారు. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో 13 కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. 

కూరగాయల మార్కెట్లు కొన్ని డివిజన్లకు దూరంగా ఉన్నటు వంటి పరిస్థితుల నేపథ్యంలో మోబైల్ విజిటేబుల్ వాహానాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం పూట మోబైల్ ద్వారా ఫోన్ చేసినా... మీకు సేవలు అందించేందుకు వీలుగా సంబందిత ఆటోల యజమానుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను కూడ తెలిపామన్నారు. మొత్తం 5 మోబైట్ విజిటేబుల్ వాహానాలకు ఏరియాలు కేటాయించడం జరిగిందని మేయర్ తెలిపారు. 

తొక్కల మల్లేషం సంబందించిన మొబైల్ ఆటో వాహనం( ఫోన్ నెం 9849895829) డివిజన్ నెం 1,2 పరిదిలోని అపోలో హాస్పిటల్ సౌరౌండింగ్ తో పాటు బుట్టిరాజారాం, విద్యారణ్యపురి. మల్యాల వెంకట రమణ ఫోన్ నెం 9963865677 గల మోబైల్ వాహానం 9,31 డివిజన్ పరిదిలోని పోచమ్మవాడ, అల్కాపురి కాలనీ, కోతిరాంపూర్. ఎండీ ఇబ్రహిం, ఫోన్ నెం 9618811564 గల మోబైల్ వాహానం 17,39 డివిజన్ పరిదిలోని విద్యానగర్, రేకుర్తి, హిందుపురి కాలని. కాటం చంద్రమౌళి ఫోన్ నెం 8500066486 గల మోబైల్ వాహానం 33,40 డివిజన్ పరిదిలోని భగత్ నగర్, గోధాంగడ్డ, వావిలాలపల్లి బ్యాంక్ కాలనీ, మెహార్ నగర్ బ్యాంక్ కాలనీ. కే.శ్రీనివాస్ ఫోన్ నెం. 6302494802 గల మొబైల్ వాహానం 58,59 డివిజన్ పరిదిలోని జ్యోతినగర్ లలో ఉయదం 6 గంటల నుండి 12 వరకు ఈ వాహానాలు కేటాయించిన డివిజన్లలో తిరిగి సేవలు అందిస్తారు. 

ఆ సమయాల్లో డివిజన్ ప్రజలు కూరగాయలు కొనుగోలు చేస్కోవాలని సూచించారు. అంతే కాకుండ రెడ్ జోన్ పరిదిలో సఫరేట్ గా కూరగాయల వాహానాలను తిప్పడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లస్వరూప రాణీ హారిశంకర్, కార్పోరేటర్ వాల రమణ రావు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios