ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారత దేశం కూడా ఈ వైరస్ బారినపడిబ్ వణికిపోతున్నారు దేశం మొత్తాన్ని 21 రోజులపాటు లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. కరోనా అనుమానితులను టెస్ట్ చేసి వారిని ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ... తెలంగాణలో ఏ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అన్ని చర్యలను చేపడుతున్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఎవ్వరికీ ఏ సమస్య రాకుండా చూసుకుంటున్నారు. 

అంతే కాకుండా ప్రజలతో నిత్యం టచ్ లో ఉంటూ రెగ్యులర్ ప్రెస్ మీట్లను నిర్వహిస్తున్నారు. ఆయన సహజ నైజానికి భిన్నమైనప్పటికీ... ఆపద వచ్చింది అనేసరికి ముందుండి నాయకత్వం వహిస్తున్నాడు. 

Also Read ఏప్రిల్ 7లోగా తెలంగాణ కరోనా ఫ్రీ: గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్...

ఇకపోతే... నిన్న ఆదివారం రాత్రి ప్రెస్ మీట్లో కేసీఆర్ శాపనార్థాలు పెట్టారు. వారికి కరోనా రావాలని చాలా కోపంగా అన్నారు. ముఖ్యమంత్రి స్థాయివ్యక్తి ఇలా కరోనా శాపాలు ఏంటి అని అనిపించినా ఆయన స్టైల్ అంతే ఉంటుంది మరి. 

ఇక వివరాల్లోకి వెళితే.... తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం, రాత్రి హెల్త్ బులెటిన్ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కానీ గత రెండు రోజులుగా బులెటిన్ రాలేదు. బులెటిన్ రాకుండా కెసిఆర్ మొన్నటి ప్రెస్ మీట్ నిర్వహించడం కేసులు పెరిగాయని చెప్పడం జరిగింది. 

ఇక వెంటనే చాలా మంది కేసీఆర్ బులెటిన్ విడుదల చేయకుండా ఇలా వచ్చి కేసులు పెరిగాయని చెప్పగానే ఇక వెంటనే పుకార్లు మొదలయ్యాయి. తెలంగాణలో కేసులు ఎక్కువయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం దాచిపెడుతోందని ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. 

అక్కడితో ఆగకుండా పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయని అందుకే కేసీఆర్ ఒక రోజు ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదని, మోడీ గారితో అందుకే కేసీఆర్ మాట్లాడారని రకరకాల పుకార్లను ఎవరికీ తోచినట్టు వారు పుట్టించారు. 

ఇలా ఫేక్ న్యూస్ పై కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేవారిని ఊరికే వదిలిపెట్టబోమని అన్నారు. ఒక వేళా పరిస్థితులు గనుక చేయిదాటిపోయే పరిస్థితులోఈ వస్తే... తాము ప్రజలను మరింత అప్రమత్తం చేస్తామని, అది తమ బాధ్యత అని అంతే తప్ప ఇలా సమాచారాన్ని దాచిపెట్టి ఉంచబోమని, అది బాధ్యతాయుతమైన ప్రభుత్వ లక్షణం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేవారికే ముందుగా కరోనా రావాలని, అది తన శాపమని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాజాల్లో అవగాహన కల్పించాలి కానీ, ఇలాంటి భయాందోళనలు సృష్టించడం మంచిది కాదని, ఈ ఫేక్ న్యూస్ పై కఠిన చర్యలను తీసుకోబోతున్నామని ఆయన అన్నారు.