ఇంట్లోనే ఉన్నామని టోకరా: ఆ ఇద్దరిపై పోలీసుల కొరడా

స్పెషల్ ఆఫీసర్స్ టీం మలేషియా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐతో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులకు తరలించారు.

coronavirus: Two NRI caught for voilating rules

కరీంనగర్: ఈ మధ్యే మలేషియా నుంచి కరీంనగర్ కు తిరిగి వచ్చిన ఓ ఎన్ఆర్ఐని అధికారులు హోం క్వారంటెైన్‌లో ఉండాలని ఆదేశించారు. అయితే మనోడు ఇంట్లోనే ఉన్నానని అధికారులకు తప్పడు సమాచారమిస్తూ మూడ్రోజులుగా బంధువులతో కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో ఎంచక్కా తిరుగుతున్నాడు. 

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్లోని రెడ్ జోన్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్యక్తి మలేసియా నుంచి ఈనెల 14న ఇంటికి చేరుకున్నాడు. అతన్ని ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. వారి మాటల కాదని 22తేదిన మానకొండూరులోని తన బంధువుల ఇంటికి చేరుకున్నాడు. అధికారులు కాల్ చేస్తే తాను ఇంట్లోనే ఉన్నానని అబద్దాలు చెప్పాడు. 
తీరా అనుమానం వచ్చిన వారు అతని మొబైల్ నెంబర్ టవర్ లొకేషన్ ద్వారా ఆచూకి కనుగొన్నారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్నస్పెషల్ ఆఫీసర్స్ టీం మలేషియా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐతో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. 

విదేశాల నుంచి వచ్చినా తమకేమీ కాదన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నవారికి కరీంనగర్ జిల్లా అధికారులు మొత్తానికి షాక్ ఇచ్చినట్టయింది. ఇక నుండైనా ఎన్ఆర్ఐలు స్వచ్చందంగా హోం క్వారంటైన్ లో ఉండాలని, అధికారులు చెప్పినట్టు నడుచుకోవాలని జిల్లా అధికారులు కోరుతున్నారు. మరికొందరైతే పేరుకు పెద్ద చదువులు చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలు చేయడం తెలుసు కానీ,కొంచెం కూడా సామాజిక బాధ్యత లేదా అని ఘాటుగా విమర్శిస్తున్నారు.

తెలంగాణలో మంగళవారంనాడు మరో మూడు కరోనా కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 39కి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే ఆరు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 6 కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios