Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో 333కు చేరిన కరోనా కేసులు, జిల్లాలవారీగా లెక్కలు ఇవీ

తెలంగాణలో ఈ ఒక్కరోజే 62 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 333 కు చేరింది.

Coronavirus: Telangna positive cases Tally increases to 283
Author
Hyderabad, First Published Apr 5, 2020, 11:29 PM IST

తెలంగాణలో కరోనా కరాళ నృత్యానికి అందరూ భీతిల్లిపోతున్నారు. నిన్న ఒక్కరోజే 62కేసులు నమోదయ్యాయి. దేనితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 333కు చేరింది. వీటిలో 297 మంది ఢిల్లీ మర్కజ్ తో సంబంధమున్నవారే కావడం గమనార్హం. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో నమోదయిన కేసుల్లో 89 శాతం కేసులు ఈ ఘటనకు సంబంధించినవే. 

162 కేసులతో హైదరాబాద్ లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. నిన్నొక్కరోజే 51 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలవారీగా గనుక తీసుకుంటే... హైదరాబాద్ లో 162 కరోనా కేసులు నమోదవ్వగా వీరిలో ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. 

నిజామాబాదు జిల్లాలో 19 కేసులు నమోదవగా, ఒకరు మృతి చెందారు,కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో 18కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. మేడ్చల్ లో 15, నల్గొండ 13, కామారెడ్డి జిల్లాల్లో 10 కేసులు నమోదయ్యాయి. 

విడుదల చేసిన బులెటిన్ తప్పులతడకగా ఉండడంతో కన్ఫ్యూషన్ నెలకొంది. బులెటిన్ లో మొన్నటి కేసులకు, నిన్నటి కేసులకు మధ్య తేడా 61 కాగా, అధికారులు మాత్రం 62 కేసులు నమోదయినట్టు పేర్కొన్నారు. 

రెండిటిలో కూడా ఏది సరైన సంఖ్యో అర్థం కాక రిపోర్టర్లు తలలు బాదుకున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి మాత్రం రాలేదు. 

 

Coronavirus: Telangna positive cases Tally increases to 283

మరోపక్క ఏపీలో కూడా పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉంది.  నేటి ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం మరో 26 కేసులు నమోదయ్యాయి. ఈ 26 కేసులతో కలుపుకొని 252 కేసులు ఇప్పటివరకు ఏపీలో నమోదయ్యాయి. ఈ 26 కేసులు కూడా ఒక్క కర్నూల్ జిల్లాలోనే నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్న అంశం. 

ఢిల్లీ మర్కజ్ నుండి వచ్చిన వారి నుండి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి జాగ్రత్తలు తీసుకొంటుంది.

శనివారం నాటికి రాష్ట్రంలో 192 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ తరువాత 12 గంటల వ్యవధిలో 34 కొత్త కేసులు నమోదు కావడంతో ఈ సంఖ్య నేటి ఉదయానికి 226కి చేరుకుంది. సాయంత్రానికి కర్నూల్ లో 26 కేసులను కలుపుకొని 252 దాటింది. 

ఢిల్లీలో ప్రార్ధనలకు కర్నూల్ జిల్లా నుండి సుమారు 200కి పైగా వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారి శాంపిల్స్ రిపోర్టు వచ్చిన తర్వాత  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీ రాష్ట్రంలో పెరిగింది. 

జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు
నెల్లూరు- 34
కృష్ణా- 28
కడప- 23
ప్రకాశం-23
గుంటూరు- 30
విశాఖ -15
పశ్చిమగోదావరి -15
తూర్పుగోదావరి -11
చిత్తూరు- 10
కర్నూల్ -53
అనంతపురం -3

Follow Us:
Download App:
  • android
  • ios