హైదరాబాద్: తెలంగాణలో మాంసాహారానికి గిరాకీ పెరిగిందని, ముఖ్యమంత్రి కెసీఆర్ వల్లనే నాన్ వెజ్ కు గిరాకీ పెరిగిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. మటన్ ధరలు మాత్రమే పెరిగాయని ఆయన చెప్పారు. చికెన్, ఫిష్ ధరలు పెరగలేదని ఆయన సోమవారం చెప్పారు. 

నాన్ వెజ్ ను అధిక ధరలకు విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. చికెన్ వల్ల కరోనా వైరస్ సోకుతుందనే ప్రచారం నేపథ్యంలో కోళ్ల ధరలు విపరీతంగా పడిపోయాయి. పౌల్ట్రీ రైతులు కోళ్లను ఉచితంగా పంచి పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.

కాగా, కేసీఆర్ ప్రకటన నాన్ వెజ్ వినియోగదారులకు భరోసా ఇచ్చినట్లు కనిపిస్తోంది. చికెన్ తింటే కరోన్ వైరస్ రాదని ఆయన తేల్చి చెప్పారు. చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ ను దూరంగా ఉంచవచ్చునని ఆయన ఇటీవల మీడియా సమావేశంలో చెప్పారు. చికెన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా మాత్రమే కరోనాను ఎదుర్కోగలమని, దానికి వేరే మందు లేదని కేసీఆర్ చెప్పారు.. 

సీ విటమన్ ఉండే ఫలాలు తినాలని కూడా ఆయన చెప్పారు. తద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. దాంతో ఆదివారంనాడు నాన్ వెజ్ కోసం ప్రజలు పెద్ద యెత్తున్న దుకాణాల వద్దకు చేరుకున్నారు.