తెలంగాణాలో 400 దాటినా కరోనా కేసులు, హైదరాబాద్ లోనే 170 కేసులు!

తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకు విస్తరిస్తుంది. మొన్న మొత్తం కేసుల సంఖ్యా 364 గా ఉండగా నిన్న ఆ సంఖ్యా 400 ను దాటింది. యాక్టీవ్ కేసుల సంఖ్య మాత్రం 348గా ఉంది. నిన్న ఒక్కరోజే 40 కేసులు నమోదయ్యాయి. 

Coronavirus Cases in Telangana: Total count crosses 400, Active Cases at 348

తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకు విస్తరిస్తుంది. మొన్న మొత్తం కేసుల సంఖ్యా 364 గా ఉండగా నిన్న ఆ సంఖ్యా 400 ను దాటింది. యాక్టీవ్ కేసుల సంఖ్య మాత్రం 348గా ఉంది. నిన్న ఒక్కరోజే 40 కేసులు నమోదయ్యాయి. 

ఇప్పటికి కూడా తెలంగాణలో ఎక్కడా కూడా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదని స్టేజి 2లోనే ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్ లో మొత్తం కేసులు 170 ని దాటితే, డిశ్చార్జ్ అయినా వారిని తీసేస్తే ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్యా 150 గా ఉంది. హైదెరాబాబాద్ తరువాత నిజామాబాదు లో 36 కేసులు నమోదయ్యాయి. 

Coronavirus Cases in Telangana: Total count crosses 400, Active Cases at 348

వరంగల్ అర్బన్ 23, జోగులాంబాలో 22, మేడ్చల్ 15, నల్గొండ 13, ఆదిలాబాద్ 11, రంగారెడ్డిలో 10 కేసుల చొప్పున నమోదయ్యాయి. మిగిలిన జిల్లాలో యాక్టీవ్ కేసుల సంఖ్య రెండంకెలనయితే దాటలేదు. 

ఇకపోతే విదేశాల నుండి హైద్రాబాద్ కు వచ్చిన  258 మందిని ఇంటికి పంపాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంగళవారం నాడు ఆదేశించింది.

గత మాసంలో విదేశాల నుండి వచ్చిన వారిని 14 రోజుల క్వారంటైన్ లో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది., శంషాబాద్ విమానాశ్రయం నుండి  రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీతో పాటు దానికి సమీపంలో ఉన్న రెండు భవనాల్లో  వీరిని క్వారంటైన్ చేశారు.

Also read:కరోనా ఎఫెక్ట్: ఈ నెల 30 వరకు కోర్టుల్లో లాక్‌డౌన్ కొనసాగించాలని హైకోర్టు నిర్ణయం

విదేశాల నుండి వచ్చిన 258 మందిని 14 రోజులుగా క్వారంటైన్ లో ఉంచారు. అయితే వీరికి పరీక్షలు నిర్వహించారు. వీరికి కరోనా వైరస్ సోకలేదని అధికారులు ప్రకటించారు. వైరస్ సోకని వారిని వెంటనే క్వారంటైన్ నుండి ఇంటికి పంపాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం నాడు నిర్ణయం తీసుకొంది. అంతేకాదు ఈ మేరకు ఆయా జిల్లాల వైద్యఆరోగ్యశాఖాధికారులకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాదికారులు ఆదేశాలు జారీ చేశారు.

క్వారంటైన్ లో ఉన్న వారిలో ఎక్కువగా రంగారెడ్డి జిల్లాకు చెందినవారు ఉన్నారని సమాచారం. ఇవాళ సాయంత్రం క్వారంటైన్ నుండి వారి ఇళ్లకు అధికారులు పంపనున్నారు. మరో వైపు క్వారంటైన్ నుండి విముక్తి లభించిన వారంతా కూడ ఇంటి వద్దే ఉండాలని సూచించారు. ఇంటి నుండి బయట తిరగకూడదని కూడ ప్రభుత్వం సూచించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios