ఇండోనేషియన్లను తెచ్చిన ఆటో డ్రైవర్ కు కరోనా పాజిటివ్

సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వచ్చిన ఇండోనేషియన్లను రామగుండం నుంచి కరీంనగర్ కు తీసుకుని వచ్చిన ఆటో డ్రైవర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని కరీంనగర్ కలెక్టర్ శశాంక తెలిపారు.

Coronavirus: Auto driver infected with Covid-19

కరీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ లో మరో కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసింది. ఇండోనేషియన్లను రామగుండం నుండి ఆటోలో తీసుకువచ్చిన ఆటోడ్రైవర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక నిర్దారించారు. ఇండోనేషియన్లు కాకుండా మరో నలుగురికి కరోనా పాజిటివ్ సోకినట్లు తేలింది.

జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి పాత్రికేయులు చేసిన కృషి మరువలేనిదని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ  మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో కరోనా వైరస్ వల్ల నెలకొన్న పరిస్థితులను పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కరోనా వల్ల సంభవించే విపత్కర పరిణామాలు వాటిపై ప్రజలు తీసుకోసువలసిన జాగ్రత్తలు, జిల్లా యంత్రాంగం కరోనా నివారణకు చేపడుతున్న చర్యలపై ప్రజలకు అర్థమయ్యేలా  ఎప్పటికప్పుడు పత్రిక, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం గావించి ప్రజలు లాక్ డౌన్, కర్ఫ్యూ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి సహకరించి పూర్తిగా ఇండ్లకే పరిమితమయ్యేలా చైతన్యపరిచారని ఆయన అన్నారు. 

Also Read: తెలంగాణలో 9కి చేరిన మృతుల సంఖ్య: ఒక్క రోజే 30 కొత్త కరోనా కేసులు

ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజలు స్వచ్చంధంగా సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన అన్నారు. అలాగే నియంత్రత ప్రాంతంలో 50 వైద్య బృందాలు, ఐ.ఎం.ఏ వైద్య బృందాలతో ఒక డాక్టర్, ఒక హెల్త్ సూపర్ వైజర్, ఒక ఏమెన్.ఎంతో ఒక టీ గా ఏర్పాటు చేసి ముకరంపురా ప్రాంతంలో ఈరోజు 2613 కుటుంబాలు సర్వే చేసి 11,136 మంది జనాభాను స్క్రీన్ చేశామని, వారిలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. 

ఇండోనేషియా నుండి వచ్చిన మత ప్రచారం కు తిరిగిన ప్రాంతాలను క్వారంటైన్ చేసి 14 రోజులు పూర్తి అయినందున మరోసారి ఈ సర్వే నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. తిరిగి తేది. 03-04-2020 న నిర్వహిస్తామని అన్నారు.

అలాగే జిల్లాలో డిల్లీలో జరిగిన సమ్మేళనానికి వెళ్లిన 14 మందిని క్వారంటైన్ చేశామని వారిలో 5గురి శాంపిల్స్ తీసి పరీక్షలకు హైదరాబాద్ పంపామని, మిగిలిన వారి శాంపిల్స్ కూడా తీసి హైదరాబాద్ పంపుతామని ఆయన అన్నారు. చల్మెట క్వారంటైన్ లో ఉన్న వారికి పరీక్షలు నిర్వహించామని నెగిటివ్ వచ్చిన 5గురిని ఇండ్లకు పంపించామని, కానీ వారిని మరి కొద్ది రోజులు క్వారంటైన్ లో ఉండాలని సూచించాలని అన్నారు.

ముఖ్యంగా రాబోవు రెండు మూడు వారాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని ప్రజల ఇప్పటివరకు ఎలా స్వచ్చంధంగా లాక్ డౌన్ కు సహకరించారో అదే విధంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎవరికైనా ఎలాంటి లక్షణాలు ఉన్నా వెంటనే 104 కు ఫోన్ చేసి ప్రభుత్వ వైద్య శాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, అలాగే వివిధ కారణాలు, జలుబు, జ్వరం, పొడి దగ్గు లాంటి లక్షణాలు ఉండి ప్రైవేటు వైద్యశాలకు వచ్చే వారిని ప్రభుత్వ వైద్యశాలకు పంపాలను ప్రైవేటు వైద్యులను ఎలాంటి డాక్టర్ స్లిప్ లెకుండా ఎలాంటి మందులు ఇవ్వద్దని  ఐఎంఎవారిని కోరామని ఆయన అన్నారు. 

అంతేగాక జిల్లాలో గుర్తించిన వలస కూలీలకు 12 కేజీల బియ్యం  500/- నగదు పంపిణీ కార్యక్రమం రేపటితో పూర్తి అవుతుందని, ముఖ్యంగా రేషన్ దుకాణాలలో బియ్యం పంపిణీ జరపడంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే కరీంనగర్ అర్బన్, రూరల్ తహశిల్దార్ ఫోన్. అర్బన్ 9490163818, రూరల్ 9652402640 లకు ఫోను చేసి ఫిర్యాధు చేయాలని ఆయన సూచించారు. అలాగే ఎవరైనా వస్తురూపం లో దానధర్మాలు చేయుటకు ముందుకొచ్చి ఔత్సాహికులు సంబంధించిన తహశిల్దార్ ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు అందించే వారు మున్సిపల్ అధికారులు, సంబంధిత ఎంపిడీఓల ఆధ్వర్యంలో మాత్రమే చేయాలని, సొంతంగా చేయకూడదని ఆయన అన్నారు.

అనంతరం పోలిస్ కమిషనర్ కమలాసన్ రెడ్ది మాట్లాడుతూ.... ఇండోనేషియా నుండి వచ్చిన వారి వల్ల జిల్లాలో ఎవరికి కరోనా సొకలేదని, అలాగే అది ప్రజల సహకారమని, మన జిల్లాలో ప్రజలకు అధికార యంత్రాంగం పత్రికా రంగం, ప్రజల సహకారంతో కరోనా మహమ్మానికి కంట్రోల్ చేయగలిగామని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలు, సూచనలు, సలహాలు స్వీకరించి స్వచ్చంధంగా ఇండ్లకే పరిమితమైన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటివరకు సహకరించిన మాదిరిగానే మరో 13 రోజులు ఓపికతో స్వియ నిర్భంధంలో ఉండి ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. 

కూరగాయలు, నిత్యావస వస్తువులు పేరుతో కొంతమంది విచ్చల విడిగా తిరుగుతున్నత్లు గమనించామని, ఇకముందు ఆలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిత్యావసరాల కొరకు ఒక్కరు మాత్రమే వెళ్లి 4 రోజులకు సరిపడా తెచ్చుకొని మిగతా మూడు రోజులు ఇంట్లో కెళ్లి బయటకు రావద్దని ఆయన చెప్పారు. అంతేగాక మోటరు సైకిల్ పై ఒక్కరు, కారు, జీపులలో ఇద్దరు తప్ప ఎక్కువ ప్రయాణిస్తే అలాంటి వాహనాలను వెంటనే సీజ్ చేస్తామని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios