బ్రేకింగ్.. గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా రోగి పరార్
రోగి పరారైనట్లు ఆస్పత్రి వర్గాలే స్వయంగా వెల్లడించాయి. కాగా... ఆస్పత్రి సిబ్బంది సమచారం మేరకు పోలీసులు అలర్ట్ అయ్యారు. బాధితుడి ఆచూకీ కోసం చిలకలగూడ పోలీసులతోపాటు.. గద్వాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం తెలంగాణ రాష్ట్ర్రంలోనూ భారీగానే ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో 333 మందికి కరోనా సోకింది. మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Also Read 108 డాక్టర్ పై కత్తులతో దాడి... పరిస్థితి విషమం...
ఇలాంటి సమయంలో.. ఓ కరోనా రోగి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డ్ నుంచి కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న రోగి ఒకరు పరారయ్యాడు. సదరు రోగి గద్వాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
రోగి పరారైనట్లు ఆస్పత్రి వర్గాలే స్వయంగా వెల్లడించాయి. కాగా... ఆస్పత్రి సిబ్బంది సమచారం మేరకు పోలీసులు అలర్ట్ అయ్యారు. బాధితుడి ఆచూకీ కోసం చిలకలగూడ పోలీసులతోపాటు.. గద్వాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా.. కొద్ది రోజుల క్రితం బాధితుడికి కరోనా సోకినట్లు గుర్తించిన అధికారులు గద్వాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ గాంధీ ఆస్పత్రిలో చేర్పించడం గమనార్హం. ఈ వార్తతో స్థానిక ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు.