Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: హాస్టల్స్ ఖాళీ చేయాలని ఆదేశం, పోలీసుల వద్దకు విద్యార్థులు

కరోనా కారణంగా హాస్టల్స్ ను ఖాళీ చేయాలని నిర్వాహకులు విద్యార్థులను కోరుతున్నారు. దీంతో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
 

corona effect in hyderabad:students applied to permission for going to hometown
Author
Hyderabad, First Published Mar 25, 2020, 1:06 PM IST


హైదరాబాద్:కరోనా కారణంగా హాస్టల్స్ ను ఖాళీ చేయాలని నిర్వాహకులు విద్యార్థులను కోరుతున్నారు. దీంతో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

కరోనా కారణంగా మూడు వారాల పాటు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్టుగా ప్రధాని మోడీ ఈ నెల 24వ తేదీన ప్రకటించారుదీంతో హాస్టల్స్ ను ఖాళీ చేయాలని యాజమాన్యాలు హాస్టల్స్ లో ఉంటున్నవారిని కోరుతున్నాయి. కరోనా కారణంగా నిత్యావసర సరుకులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 

also read:దారుణం: కరోనా అంటూ తల్లిని రోడ్డునే వదిలేశాడు, కానీ....

హస్టల్  నిర్వహించడం కొంత ఇబ్బందిగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో హాస్టల్స్ ను మూసివేస్తే ప్రయోజనంగా ఉంటాయని భావిస్తున్నారు.హాస్టల్స్ ఖాళీ చేయాలని  హాస్టల్స్ లో ఉంటున్న వారిని కోరారు. దీంతో తాము స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ పంజగుట్ట పోలీసులను కోరారు విద్యార్థులు. 

ఈ విషయమై విద్యార్థుల బాధను అర్ధం చేసుకొన్న పోలీసులు వారిని స్వగ్రామాలకు తరలించేందుకు ప్రత్యేకంగా అనుమతులు ఇస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios