Asianet News TeluguAsianet News Telugu

CM KCR : నిబంధ‌న‌లు పాటించిస్తూ.. . పండుగ చేసుక్కోండి: సీఎం కేసీఆర్

CM KCR : తెలంగాణ రాష్ట్రంనేపథ్యంలో లో కరోనా పరిస్థితిపై సీఎం కేసీఆర్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. రాబోయే సంక్రాంతి గుంపులుగా కాకుండా ఎవరింట్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలన్నారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగా ఉందన్నారు. ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్దంగా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
 

Cm Kcr Review On Corona Situation In State
Author
Hyderabad, First Published Jan 10, 2022, 1:34 AM IST

CM KCR :  దేశ‌వ్యాప్తంగా క‌రోనా, ఒమిక్రాన్ విస్త‌రిస్తున్నాయి. భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. 
వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.  మ‌న రాష్ట్రంలో కూడా క‌రోనా త‌న పంజా విసురుతోంది. కేవ‌లం వారం రోజుల వ్య‌వ‌ధిలోనే కేసులు మూడింత‌లు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో  కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి..వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతి భవన్లో ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ త‌ప్ప‌ని స‌రిగా వాక్సినేషన్  వేయించుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు.కరోనా భయం అక్కర్లేదని పేర్కొన్నారు. అయితే, ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని,  అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం. శానిటైజేషన్ చేసుకోవడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తున్నదన్నారు.తల్లిదండ్రులు అశ్రద్ద చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలని సూచించారు.  

వ్యాధి లక్షణాలు ఉన్న వారు అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాల‌ని అన్నారు.  ఈ స‌మీక్ష స‌మావేశంలో ఆరోగ్యశాఖతో పాటు రోడ్లు భవనాలు,ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు.

స్వీయ నియంత్రణాచర్యల ద్వారానే కరోనా కట్టడి చేయ‌వ‌చ్చున‌ని సీఎం కేసీఆర్  సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని,భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోసారి కరోనా ఉధృతమవుతుంద‌నీ,  వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులపై స‌మీక్షించారు. ఆక్సిజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్దంగా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
 
 ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నా కేసీఆర్.  ముఖ్యంగా వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. త్వ‌ర‌లో సంక్రాంతి పండుగ వస్తోందని, ఈ పండుగ  స‌మ‌యంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని,  ప్రజలు గుమికూడవద్దని, ఇళ్లలోనే పండుగ చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. అర్హులైనా వారంద‌రరూ వ్యాక్సినేష‌న్ చేయించుకోవాల‌ని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య  క్ర‌మంగా  పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 48,583 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో  కొత్తగా 1,673 మందికి పాజిటివ్‌‌గా నిర్థార‌ణ అయ్యింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,94,030కి చేరింది. అదేస‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారికి  ఒకరు బ‌ల‌య్యాడు.  దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 4,042కి చేరుకుంది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజు 330 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 13,522 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios