కరీంనగర్ కు కరోనాను మోసుకొచ్చిన ఇండోనేషియన్లపై కేసులు
తెలంగాణలోని కరీంనగర్ కు కరోనా వైరస్ ను మోసుకొచ్చిన ఇండోనేషియన్లపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారికి గైడ్ గా వ్యవహరించినవారిపై కూడా కేసులు పెట్టారు.
కరీంనగర్: కరోనా వైరస్‌ను మోసుకొచ్చిన ఇండేనేషియన్లపై కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. క్రైం నెంబర్ 108/2020.. ఐపీసీ సెక్షన్ 420, 269, 270, 188ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎపడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 సోక్షన్ 3, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్టు 2005 సెక్షన్ 51 బి, ఫారినర్స్ యాక్ట్ 1947 సెక్షన్ 14 (1) (బి), 7,13, 14(సి) ల ప్రకారం వన్ టౌన్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ విజయ్ కుమార్ కేసు నమోదు చేశారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది.
కరీంనగర్ లో పర్యటించిన 10 మంది ఇండోనేషియా దేశస్థులు, వారికి గైడ్లుగా వ్యవరించిన ఇద్దరు, స్థానికంగా ఆశ్రయం కల్పించిన వారిపై కూడా వన్ టౌన్ పోలీసుస్టేషన్ లో కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొని వారు సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో రామగుండం వచ్చారు. రామగుండం నుంచి ఆటోలో కరీంనగర్ వచ్చారు.
ప్రస్తుత లాక్ డౌన్, కర్ఫ్యూ సందర్భంగా కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వాహనాలతోపాటు, వివిధ విభాగాలకు చెందిన పోలీస్శాఖ వాహనాలకు సోమవారంనాడు యాంటీవైరస్శానిటైజేషన్ నిర్వహించారు.
కరోనా వ్యాప్తి నేపధ్యంలో ముందుకుజాగ్రత్త చర్యగా ఈ యాంటీవైరస్ శాన్ిటైజేషన్ ను చేపట్టారు కరీంనగర్లోని కాకతీయ టయోట షోరూం వారి సహకారంతో ఈ శానిటైజన్ కొనసాగింది విధినిర్వాహణలో ఉన్న పోలీసులు వైద్యుల సూచనలు, తగు జాగ్రత్తలను తీసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు.
అత్యవసర విధులను నిర్వహించే ఉద్యోగులకు ఎలాంటి ఆకంటం కలిగించకుండా సహకారం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ(యంటివో) జానీమియా, టయోటషోరూం మేనేజర్ సునీల్ తదితరులుపాల్గొన్నారు