కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యాలయంలో 90శాతం మందికి కరోనా... !!
ఢిల్లీలోని తన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి ఇటీవల Corona tests చేయగా 90% మందికి Positive వచ్చిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి Kishan Reddy తెలిపారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని.. లక్షణాలు తక్కువగా ఉన్న జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచించారు.
నారాయణగూడ : కరోన ఉదృతి తగ్గడం లేదు. మహమ్మారి రూపం మార్చుకుంటూ దాడి చేస్తూనే ఉంది. ఢిల్లీలోని తన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి ఇటీవల Corona tests చేయగా 90% మందికి Positive వచ్చిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి Kishan Reddy తెలిపారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని.. లక్షణాలు తక్కువగా ఉన్న జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచించారు.
‘Azadi ka Amrit Mahotsav’ లో భాగంగా ఆదివారం హైదరాబాద్ నారాయణగూడ లోని కేశవ స్మారక విద్యాసంస్థల క్రీడా మైదానంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 నుండి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరికీ Vaccine ఇప్పించాలని తల్లిదండ్రులను కోరారు. అలాగే కరోనా తీవ్రత తగ్గే వరకూ ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు.
దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా వేసిన ముగ్గులు దగ్గరికి వెళ్లి ఫోటోలు దిగి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే ధృవపత్రం వస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, హిమాయత్ నగర్ బిజెపి కార్పొరేటర్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ బాధిత గర్భిణుల ప్రసవాలకు జిల్లాల్లోనే ప్రత్యేక వార్డులు…
ప్రసవ సమయంలో కోవిడ్ బారినపడిన గర్భిణీలకు జిల్లా Teaching Hospitalల్లోనే ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బోధనాసుపత్రుల్లోని జనరల్ మెడిసిన్ వైద్యులు చికిత్సకు సహకరించాలన్నారు. Pregnantకి బహుళ స్పెషాలిటీ వైద్య సేవలు అవసరమైతేనే గాంధీ ఆసుపత్రికి పంపించాలని స్పష్టం చేశారు ఈ మేరకు అన్ని బోధనాసుపత్రుల బాద్యులకు ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీస్ శాఖ అప్రమత్తం…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. సిబ్బంది విధి నిర్వహణలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని, ఠాణాలకు వచ్చే ప్రజలతో భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ ల వినియోగంపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆన్లైన్లో పిటిషన్ స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ముందస్తు నివారణ టీకా పంపిణీకి ఏర్పాట్లు..
రాష్ట్రంలో ఆదివారం 77,737 మందికి కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కుల్లో 6,97,335మందికి టీకా డోసులు వేశారు. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారిలో దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, వైద్య సిబ్బంది సహా ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లకు సోమవారం నుంచి ముందస్తు నివారణ టీకా పంపిణీ చేయనున్నారు. సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
కొత్తగా 1673 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 1,673 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలో 1,165, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 149, రంగారెడ్డిలో 123, సంగారెడ్డిలో 44, హనుమకొండ జిల్లాలో 34 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 330 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు మృతి చెందారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు.