Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కొత్తగా మరో 27 మందికి కరోనా, 150 మార్కును దాటేసిన కేసులు!

తెలంగాణలో ఈరోజు కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. ఈ 27 కేసులతో కలుపుకొని తెలంగాణలో కేసులు 154 కు చేరుకున్నాయి. ఈ రోజు ఒక్క మరణం కూడా సంభవించలేదు. ముగ్గురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

27 new coronavirus cases today in telangana, numbers rise upto 154
Author
Hyderabad, First Published Apr 3, 2020, 1:25 AM IST

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారు, వారి కుటుంబీకులు, సన్నిహితులను ఐసోలేటె చేయడంతో దాదాపుగా తెలంగాణలో కరోనా తలనొప్పులు దాదాపుగా తగ్గినట్టే అని అంతా భావించారు. 

కానీ ఢిల్లీ నిజాముద్దీన్ లో ప్రార్థనలకు వెళ్ళివచ్చినవారి వల్ల ఇప్పుడు కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. తెలంగాణలో సంభవించిన కరోనా మరణాలన్నీ కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే. 

తెలంగాణలో ఈరోజు కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. ఈ 27 కేసులతో కలుపుకొని తెలంగాణలో కేసులు 154 కు చేరుకున్నాయి. ఈ రోజు ఒక్క మరణం కూడా సంభవించలేదు. ముగ్గురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

మొత్తం కేసులు 154 గా ఉన్నప్పటికీ.... ఆ మొత్తం కేసుల్లో ఇప్పటివరకు 17 మంది డిశ్చార్జ్ అయ్యారు. 9 మంది మరణించారు. ఈ లెక్కలను గనుక తీసుకుంటే...  తెలంగాణలో యాక్టీవ్ కేసులు కేవలం 128 మాత్రమే! 

ఈ పెరుగుతున్న కేసులన్నీ కూడా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలతో సంబంధాలు ఉన్నవే. తెలంగాణ నుంచి నిజాముద్దీన్ కి 1032 మంది వెళ్లినట్టు తెలంగాణ అధికార వర్గాలు తేల్చాయి. 

ఢిల్లీలో మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారి కోసం ఆరా తీస్తోంది. రెండు రోజులుగా ప్రభుత్వం వీరి కోసం అన్వేషణ ప్రారంభించింది. అయితే సోమవారం నాడు రాత్రి నలుగురు మృతి చెందడంతో  వీరిని వెంటనే గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రాకింగ్ బృందాలను ఏర్పాటు చేసింది.

హైద్రాబాద్ నుండే అత్యధికంగా 603 మంది ఈ ప్రార్థనల్లో పాల్గొనేందుకు వెళ్లినట్టుగా గుర్తించారు. అయితే ఈ సమావేశాలకు వెళ్లినవారి సమాచార సేకరణకు జీహెచ్ఎంసీ, పోలీస్, రెవిన్యూ అధికారులతో ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటు చేసింది సర్కార్. ఇక జిల్లాల్లో రెవిన్యూ, పోలీసులతో పాటు వైద్యులతో కమిటిలను ఏర్పాటు చేశారు.

also read:చెస్ట్ ఆసుపత్రి నుండి 10 మంది ఇండోనేషియన్ల డిశ్చార్జ్: కానీ ట్విస్ట్ ఇదీ...

హైద్రాబాద్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ప్రార్థనలకు హాజరైన వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం నాడు రాత్రి వరకు ట్రాకింగ్ పూర్తి చేయనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన వారే కారణమని ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత క్వారంటైన్ లో లేకపోవడంతో పాటు ఇతరులతో సన్నిహితంగా ఉన్న కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణమైందనే ప్రభుత్వవర్గాలు అభిప్రాయంతో ఉణ్నాయి.


జిల్లాల వారీగా నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య ఇలా ఉంది.

హైద్రాబాద్- 603
ఆదిలాబాద్-30
కొత్తగూడెం -11
జగిత్యాల-25
జనగామ- 4
భూపాలపల్లి- 1
గద్వాల -5
కరీంనగర్ -17
ఖమ్మం -27
మహబూబాబాద్- 6
మహబూబ్ నగర్- 11
మంచిర్యాల- 10
మెదక్ -2
మేడ్చల్ -2
ములుగు- 2
నాగర్ కర్నూల్- 4
నల్గొండ -45
నిర్మల్ 25
నిజామాబాద్- 80
పెద్దపల్లి- 6
సిరిసిల్ల- 9
రంగారెడ్డి- 13
సంగారెడ్డి- 22
సూర్యాపేట- 3
వనపర్తి- 3
వికారాబాద్- 7
వరంగల్ రూరల్- 1
వరంగల్ అర్బన్- 38
యాదాద్రి భువనగిరి- 4

Follow Us:
Download App:
  • android
  • ios