ఎట్టకేలకు కరోనాపై యుద్ధానికి "విరుష్క" జంట విరాళం
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మలు కూడా ప్రధానమంత్రి సహాయనిధికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతుగా విరాళాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు.
భారతదేశంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రజలందరూ వణికిపోతున్నారు. ప్రజలను ఎలాగైనా ఈ మహమ్మారి బారి నుండి కాపాడాలని సోషల్ డిస్టెంసింగ్ ను పాటించమని పదే పదే కోరుతుంది. అందుకోసమని దేశమంతా లాక్ డౌన్ కూడా విధించింది.
ఇలా దేశం కారొనపై పోరులో నిమగ్నమై ఉండగా దేశంలోని సెలెబ్రిటీలందరూ తమవంతు సహాయంగా ముందుకొచ్చి విరాళాలను ఇస్తున్నారు. సినీ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల భూరి విరాళాన్ని ఇచ్చాడు. తెలుగు హీరోలు కూడా సహాయాన్ని అందించడంలో ముందు వరసలో ఉన్నారు.
Also read:లాక్‌డౌన్: ప్రజలతో సోషల్ మీడియా మమేకమిలా...
తాజాగా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మలు కూడా ప్రధానమంత్రి సహాయనిధికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతుగా విరాళాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. భారత ప్రజలు పడుతున్న బాధలు చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని, తమ చైనా సహాయం ఎంతోకొంతయినా సాటి భారతీయుల కష్టాలను తీర్చగలుగుతుందని ఆశిస్తున్నట్టు విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.
ఇకపోతే.... రెండు రోజుల కింద విరాట్ కోహ్లీ కరోనా విషయం మీద ఒక వీడియో రిలీజ్ చేసాడు. లాక్‌డౌన్‌పై అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. కష్టకాలంలో దేశానికి అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చాడు. వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా మేల్కొని నడుచుకోవాలని, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా మెలగాలి అభిమానులను కోరాడు విరాట్ కోహ్లీ.