న్యూఢిల్లీ: కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు.. సోషల్ మీడియా వేదికలు అనూహ్యంగా ప్రతిస్పందిస్తున్నాయి. అను నిత్యం ప్రజలకు ఉపయోగపడే సమాచారం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతోపాటు తమ వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నాయి.

కరోనా వ్యాప్తికి ముందు టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు ఉన్న ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కసారిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమోనన్న అభిప్రాయం ఉంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే సంస్థలుగా ఇప్పటి వరకు ముద్రపడిన ఈ టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు ప్రజల అభిమానాన్ని పొందుతున్నాయి.

ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, ట్విటర్ లాంటి సంస్థలు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని అనునిత్యం ప్రజలకు చేరవేస్తున్నాయి. ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ కూడా ఇదే బాటలో నడుస్తోంది.

కరోనా వైరస్ బారి నుంచి ప్రజలు బయటపడేందుకు లక్షల కొద్దీ డాలర్ల ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీఫ్ సాయం కింద ప్రకటిస్తున్నాయి. అంతేకాక పెద్ద మొత్తంలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌9 మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందిస్తున్నాయి.

ఈ వైరస్‌తో ఉపాధి భారీగా కోల్పోయి, నిరుద్యోగం ప్రబలుతుండటంతో చిన్న సంస్థలకు ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ సాయం చేస్తోంది. ఇప్పటికే 100 మిలియన్ డాలర్ల ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇది ప్రకటించింది. అమెజాన్ కూడా కొత్తగా లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం టెక్ కంపెనీలే మన జీవన విధానాల్లో ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయని కొందరు నిపుణులు అంటున్నారు.

సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని, లాక్ డౌన్ వేళ ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావొద్దని ఆదేశాలు ఉండటంతో ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు, కొన్ని రకాల సేవల  కోసం  ఇప్పుడు ప్రజలు ఎక్కువగా టెక్ మాధ్యమాలపైనే ఆధారపడుతన్నారు.

కరోనా టెస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గూగుల్ కూడా ఒక ముఖ్యమైన హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. అమెజాన్ అయితే ప్రజలకు అవసరమైన అన్ని రకాల ఫుడ్ సప్లయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపడుతోంది. అమెజాన్, ఆల్ఫాబెట్, ఆపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాలంటీర్లు రేయింబవళ్లు స్పందిస్తూ వైరస్ వ్యాప్తిని ట్రాక్ చేస్తూ ఉన్నారు. 

ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, ట్విటర్, టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాక్, మైక్రోసాఫ్ట్ సంస్థలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భాగస్వాములుగా మారిపోయి, కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంబంధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయి. అమెరికాలోని అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పది మందికి కరోనా పాజిటివ్ వచ్చినా కూడా పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకోవడం కోసం లక్ష మందిని నియమించుకుంటానని ఆ సంస్థ చెప్పింది. 

అంతేకాక అమెజాన్ వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త రకం పాలసీలను తీసుకొచ్చింది. ఎప్పడికప్పుడు డోర్లను క్లీన్ చేయడం, టచ్ స్క్రీన్లను ఏర్పాటు చేయడం వంటి వాటిని వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీసుకొచ్చింది. 

అమెజాన్ తన ఉద్యోగులు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చేస్తోంది. తన ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్ల కోసం లక్షల కొద్దీ ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లను ఆర్డర్ చేసింది. అంతకుముందు కంటే సమర్థవంతంగా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది.

ప్రజలు ఎక్కువగా తమకు కావాల్సిన వస్తువులను స్టోర్లకు వెళ్లి కొనుక్కోకుండా ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కొనాలని ప్రమోట్ చేస్తోంది. అమెజాన్ ఎకో లాంటి డివైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను షిప్ చేస్తోంది. అయితే అవసరం లేని వస్తువుల డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమెజాన్ తక్కువగా చేపడుతోంది.

లాక్ డౌన్ అమలులో ఉండటంతో వివిధ సంస్థల సర్వీస్ సెంటర్లు పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో తమ కస్టమర్ల సందేహాలను సోషల్ మీడియా, ఇతర ఆన్ లైన్ సాధనాల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

సోనీ, శామ్ సంగ్, పనాసోనిక్, హయ్యర్, గోద్రేజ్ అప్లయనెన్స్ వంటి కంపెనీలు వైవ్ చాట్, వాట్సాప్, డీఐవై వీడియో వంటి  మాధ్యమాలతోపాటు ఆన్ కాల్ అసిస్టెన్స్ ద్వారా మారుమూల ప్రాంతాల ఖాతాదారులతో సంభాషిస్తున్నాయి. 

‘వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా సమస్య తెలుసుకుంటున్నాం. వీడియోలు చూపడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం. చిన్న, చిన్న మార్పులేమైనా చేయాల్సి వస్తే కస్టమర్లే చూసుకునేలా వివరిస్తున్నాం’ అని ఓ హోం అప్లయనెన్స్ సంస్థ ప్రతినిధి చెప్పారు.

Also reaad:ఖాతాదారులు కాకున్నా ఫేస్‌బుక్ లైవ్ వీక్షించొచ్చు..

ఏసీలు సొంతంగా శుభ్రం చేసుకునేలా వీడియోలు సిద్ధం చేశామని పనాసోనిక్ ఇండియా ప్రతినిధి తెలిపారు. సోనీ ఇండియా కాల్ సెంటర్ కూడా మూత పడినందున ఐవీఆర్ మెసేజ్ ద్వారా, సంబంధిత వెబ్ పేజీకి చేరుకునేలా వినియోగదారులకు సూచనలిస్తోంది. అందులో నుంచి లైవ్ చాట్ ద్వారా సంస్థ ప్రతినిధి తమ కస్టమర్లకు సహకరిస్తున్నట్లు సోనీ ఇండియా తెలిపింది. 

శామ్ సంగ్ కూడా లైవ్ చాట్ ద్వారానే సందేహాలు తెలుపాలని వినియోగదారులను కోరింది. హయ్యర్ సంస్థ వాట్సాప్, లైవ్ చాట్, కేర్ లైన్ ద్వారా కూడా సందేహాలను పరిష్కరిస్తున్నది. హయ్యర్ సంస్థ తన అన్ని ఉత్పత్తులపై వారంటీని లాక్ డౌన్ తొలిగించిన తర్వాత రెండు నెలల వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.