కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌  అధినేత విజయ్ మాల్యా కరోనావైరస్, లాక్‌డౌన్‌ సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థికప్యాకేజీ పై తన దైన శైలిలో ట్వీట్ చేశారు. వేలకోట్ల రుణాలు ఎగవేత, మనీలాండరింగ్  ఆరోపణలు వంటి కేసులను ఎదుర్కొంటున్నారు. 

 ఈ కేసులకు  సంబంధించి తనని భారత్‌కు అప్పగించే ఉత్తర్వులకు వ్యతిరేకంగా లండన్ హైకోర్టులో అప్పీల్ చేశారు. దాని తరువాత ఈ నెల ప్రారంభంలో మాల్యా యు.కె సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.

తనని తిరిగి భారత్‌కు అప్పగించడానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విజయ్ మాల్యా గురువారం తను తీసుకున్న రుణ బకాయిల్లో 100 శాతం తిరిగి చెల్లిస్తాను అనే తన ప్రతిపాదనను అంగీకరించాలని, తనపై కేసును మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా రూ .20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన భారత ప్రభుత్వాన్ని మాల్యా అభినందించారు.

also read లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్‌: 67% మంది జాబ్స్ హుష్‌కాకి.. తాజా సర్వే..

ప్రభుత్వ బ్యాంకుల రుణాలను పూర్తిగా చెల్లిస్తారని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోక పోవడం న్యాయమా అని వాపోయారు.  వరుసగా తన అభ్యర్థనను తోసిపుచ్చుతున్నారని విమర్శించారు. దయచేసి ఆ నగదును తీసుకొని తన కేసును క్లోజ్ చేయాలని మాల్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

"కోవిడ్ 19 రిలీఫ్ ప్యాకేజీ పై ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతు ఇక ప్రభుత్వం వారు కోరుకున్నంత కరెన్సీని ముద్రించూకొవచ్చు, కాని ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ రుణాల 100% తిరిగి చెల్లించే నా లాంటి చిన్న చెల్లింపుదారుడుని నిరంతరం విస్మరించాలా?" అంటు మాల్య ట్వీట్ చేశాడు.

9,000 కోట్ల రూపాయల మోసం మరియు మనీలాండరింగ్ ఆరోపణలపై భారతదేశంలో పనిచేయని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ యొక్క ప్రమోటర్ మాల్యా, "దయచేసి నా డబ్బును బేషరతుగా తీసుకొని మూసివేయండి" అని అన్నారు. గతంలో, మాల్య కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అప్పుగా తీసుకున్న మొత్తంలో 100 శాతం బ్యాంకులకు చెల్లించటానికి ముందుకొచ్చానని ట్వీట్ చేశారు, కాని బ్యాంకులు డబ్బు తీసుకోవడానికి సిద్ధంగా లేవు అన్నారు.