అక్షయ తృతీయ స్పెషల్: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్...

కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ ఈ నెల 26న జరగే అక్షయ తృతీయ వేడుకలకు ప్రతిబంధకంగా మారింది. కానీ ప్రముఖ జ్యువెల్లరీ షాపులు తనిష్క్, కల్యాణ్ సంస్థలు ఆన్ లైన్ విక్రయాలకు తెర తీశాయి.
 

Tanishq brings Akshaya Tritiya online this year

న్యూఢిల్లీ: పండుగ రోజు మంచి పని చేస్తే కలిసి వస్తుందంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే మంచిదని చాలా మంది విశ్వాసం. ధర ఎంత ఉన్నా ఆనాడు చిన్న మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిదని అత్యధికులు భావిస్తుంటారు. 

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. జ్యువెల్లరీ దుకాణాలు కూడా మూత పడ్డాయి. 

దీంతో ఈ దఫా అక్షయ తృతీయ (ఏప్రిల్ 26) సందర్భంగా ఎలా బంగారం కొనుగోలు చేయాలి? అన్న విషయమై చాలా మందిలో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం దుకాణాలు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చాయి. ప్రజలకు తమ సేవలను ఆన్‌లైన్‌లో అందించేందుకు సిద్ధమని ప్రముఖ బంగారం దుకాణ సంస్థలు తనిష్క్, కల్యాణ్ జ్యువెల్లర్స్ ప్రకటించాయి.

టాటా గ్రూప్ అనుబంధ బంగారం నగల తయారీ సంస్థ ‘తనిష్క్’ ఈ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌  www.tanishq.co.in.లో వినియోగదారులు తమకు ఇష్టమైన నగలు కొనుగోలు చేయొచ్చునని తనిష్క్ వెల్లడించింది. 

also read ఈ కామర్స్ కంపెనీలకు కేంద్రం షాక్: టీవీలు, మొబైల్ విక్రయాలకు అనుమతి రద్దు

ఇందుకోసం తమ సిబ్బంది వీడియో కాల్, ఆన్ లైన్ ఛాటింగ్ ద్వారా అందుబాటులో ఉంటారని తనిష్క్ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో బంగారం ఆభరణాలను కొనుగోలు చేసిన వారికి లాక్ డౌన్ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే ఆ బంగారాన్ని వారి ఇంటి వద్దే డెలివరీ చేస్తామని తనిష్క్ తెలిపింది. 

లేని పక్షంలో వినియోగదారులే తమ ఇంటికి దగ్గర్లోని తమ దుకాణంలో తాము కొనుగోలు చేసిన వస్తువును పొందవచ్చునని తనిష్క్ వెల్లడించింది. ‘మా వినియోగదారుల్లో 54 శాతం మంది అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆన్‌లైన్‌లో వినియోగదారులకు సేవలందించాలని నిర్ణయించాం’ అని తనిష్క్ పేర్కొంది.

అక్షయ తృతీయ నాడు బంగారం ఎలా కొనుగోలు చేయాలని చలా మంది సంస్థ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కల్యాణ్ జ్యువెల్లర్స్ పేర్కొన్నది. అందుకే కొనుగోలు దారుల కోసం తమ సేవలను ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అందివ్వనున్నట్లు తెలిపింది. 

కొనుగోలుదారులు 2 గ్రాముల నుంచి ఆపై ఎంతమొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేయొచ్చని తెలిపింది. అయితే, కొనుగోలు పూర్తయిన తర్వాత సంస్థ ‘గోల్డ్ ఓనర్ షిప్ సర్టిఫికెట్’ పేరుతో కొనుగోలు ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తామని పేర్కొన్నది. 

తనిష్క్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టీఎన్ కల్యాణ్ రామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండటంతో తొలిసారి ఈ విధానాన్ని పాటిస్తున్నాం. ఈ విధంగా అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయాలనే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు. 

కాగా, కల్యాణ్‌ జువెలర్స్‌  కూడా మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభిస్తోంది. ఈ ఆన్‌లైన్‌ అమ్మకాల్లో కనీసం రెండు గ్రాముల బంగారం కొనుగోలు చేయాలి. అలా కొన్న వ్యక్తులకు గోల్డ్‌ ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ జారీ చేసి అక్షయ తృతీయ రోజున అందజేస్తుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios