రెండేళ్ల పాటు ఎంపీ నిధులు కట్, జీత భత్యాల్లో 30 శాతం కోత: కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: ఏడాది పాటు ఎంపీల జీత భత్యాలు, అలవెన్సుల్లో 30 శాతం కోత విధించే ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రివర్గం సోమవారం నాడు ఆమోదం తెలిపింది.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రివర్గం సోమవారం నాడు చర్చించింది.
న్యూఢిల్లీ: ఏడాది పాటు ఎంపీల జీత భత్యాలు, అలవెన్సుల్లో 30 శాతం కోత విధించే ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రివర్గం సోమవారం నాడు ఆమోదం తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రివర్గం సోమవారం నాడు చర్చించింది. కరోనా నేపథ్యంలో తొలిసారిగా వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వివరించారు.
ఎంపీల జీతభత్యాలు, పెన్షన్ 1954ను సవరించే ఆర్డినెన్స్ ను సోమవారం నాడు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారంగా ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఏడాది పాటు ఎంపీల జీతభత్యాలు 30 శాతం తగ్గనున్నాయి.
మరో వైపు రాష్ట్రపతి ,ఉప రాష్ట్రపతి, గవర్నర్లు కూడ తమ జీత భత్యాల్లో 30 శాతం కోత విధించుకొనేందుకు ముందుకు వచ్చినట్టుగా ఆయన వివరించారు.కేంద్ర మంత్రుల జీతాల్లో కూడ 30 శాతం కట్ చేయనున్నట్టుగా మంత్రి తెలిపారు.ఈ మేరకు కేంద్ర మంత్రులు కూడ అంగీకరించారన్నారు.
also read:కరోనాపై మన నిర్ణయాలు ప్రపంచానికి ఆదర్శం: బీజేపీ కార్యకర్తలతో మోడీ
2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరాలకు గాను ఎంపీలాడ్స్ సస్పెండ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధులన్ని భారత కన్సాలిడేటేడ్ ఫండ్స్ లో జమ కానున్నట్టుగా కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు.
లాక్ డౌన్ ఈ నెల 14వ తేదీన ఎత్తివేస్తారా అనే విషయమై మంత్రి స్పష్టత ఇవ్వలేదు. కరోనాపై ప్రతి క్షణం ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు. ఆ రోజున నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ పై కేంద్రం నిర్ణయం తీసుకోనుందన్నారు.