న్యూఢిల్లీ: ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ తో పాటు ఆయన భార్యకు కూడ కరోనా సోకిందని వైద్యులు ప్రకటించారు. గురువారం నాడు ఉదయం ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ కు కరోనా సోకిందని వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ కు కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వెంటనే వైద్యులు అదే ఆసుపత్రిలో ఆయనను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు.

ఎయిమ్స్  డాక్టర్ భార్య ప్రస్తుతం గర్భవతి. ఆమెను ఎయిమ్స్ వైద్యులు పరీక్షించారు. ఆమెకు కూడ పరీక్షలు నిర్వహిస్తే కరోనా సోకిందని నిర్ధారణ అయింది. దీంతో ఆమెను కూడ ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

కరోనా సోకిన డాక్టర్ భార్య డెలీవరి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఈ విషయంలో తాము అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకొంటామని వైద్యులు తేల్చి చెప్పారు.ఎయిమ్స్ లో రెసిడెంట్ వైద్యుడికి గురువారం నాడు ఉదయం కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన విషయం తెలిసిందే.

also read:ఎయిమ్స్ డాక్టర్ కు కరోనా: ఢిల్లీలో ఏడుగురు డాక్టర్లకు పాజిటివ్

ఆసుపత్రిలోనే కొత్త వార్డులోకి డాక్టర్ ను చేర్పించారు.డాక్టర్ తో సన్నిహితంగా ఉన్నవారితో పాటు ఆయన వద్ద చికిత్స తీసుకొన్న వారిని కూడ గుర్తించి హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.