న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ కు గురువారం నాడు కరోనా వైరస్ సోకింది. దీంతో ఢిల్లీలో ఈ వైరస్ సోకిన డాక్టర్ల సంఖ్య ఏడుకు చేరింది.

ఎయిమ్స్ లో పనిచేసే డాక్టర్ కు ఈ  వైరస్ సోకినట్టుగా గుర్తించారు.  అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు. అతడికి మరికొన్ని పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

Also read:ఇండియాపై కరోనా దెబ్బ: 50 మంది మృతి, 1965కి చేరుకొన్న కేసులు

మరోవైపు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న డాక్టర్ కుటుంబసభ్యులను కూడ స్క్రీనింగ్ చేయనున్నట్టుగా ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో పనిచేసే నలుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా బుధవారం నాడు నివేదికలు వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందే మరో ఇద్దరు డాక్టర్లకు కూడ కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో చోటు చేసుకొన్న ఈవెంట్ కారణంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది. మర్కజ్ ప్రాంతంలో ఉన్నవారిలో ఎక్కువగా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

 మర్కజ్ లో ఉన్న వారిని ప్రభుత్వం క్వారంటైన్ ను తరలించి చికిత్స అందిస్తోంది.మర్కజ్ ప్రార్థనలకు వచ్చిన వారి నుండే దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడ ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదౌతున్న విషయం తెలిసిందే.