కరోనా కాలం.. చిన్నారికి ‘కోవిడ్’ గా నామకరణం
ప్రస్తుతం కరోనా వైరస్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రీతీ, ఆమె భర్త ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. వారిలో ఆడ శిశువుకు కరోనా అని, మగ శిశువుకు కోవిడ్ అని పేరు పెట్టారు.
ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ఎక్కడ చూసినా కరోనా పేరు తప్ప మరేమీ వినపడటం లేదు. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు చాలా చిత్ర విచత్రంగా ఆలోచిస్తున్నారు. కరోనా కాలంలో పుట్టిన పిల్లలకు.. అవే పేర్లతో నామకరణం చేస్తున్నారు.
ఇటీవల ఇద్దరు కవల పిల్లలకు కరోనా, కోవిడ్ అని నామకరణం చేసుకున్నారు వారి తల్లిదండ్రులు. ఛత్తీస్‌ఘడ్, రాయ్‌పూర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఆసుపత్రిలో మార్చి 27 తెల్లవారుజామున ప్రీతివర్మ (27) అనే మహిళకు కవల పిల్లలు జన్మించారు.
Also Read కరోనా రోగులు ఇతరులపై ఉమ్మివేస్తే.. డీజీపీ షాకింగ్ నిర్ణయం...
దీంతో వారు తమ పిల్లలకు కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రీతీ, ఆమె భర్త ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. వారిలో ఆడ శిశువుకు కరోనా అని, మగ శిశువుకు కోవిడ్ అని పేరు పెట్టారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ ఇదే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తనకు పుట్టిన కొడుకుని కోవిడ్ అని నామకరణం చేసింది. వారి స్వస్థలం నేపాల్ కాగా.. లాక్ డౌన్ ప్రకటన తర్వాత తమ స్వస్థలానికి వెళ్లాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ అమలులో ఉండటంతో... వారు వెళ్లడానికి యూపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో... యూపీలోని రామ్ పూర్ లో ఉండిపోయారు. వారికి కొద్ది రోజుల క్రితం మగపిల్లాడు జన్మించగా.. తొలుత వేరే పేరు పెట్టారు. లాక్ డౌన్ లో ఇరుక్కున్న తర్వాత కోవిడ్ గా పేరు మార్చారు.