కరోనా రోగులు ఇతరులపై ఉమ్మివేస్తే.. డీజీపీ షాకింగ్ నిర్ణయం

ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ డీజీపీ ఎస్‌ఆర్ మర్ది షాకింగ్ కామెంట్స్ చేశారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఇతరులపై ఉమ్మివేస్తే హత్యాయత్నం కింద కేసు నమోదు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ డీజీపీ ఎస్‌ఆర్ మర్ది హెచ్చరించారు. 
 

Attempt to murder charge for COVID-19 patient who spit on someone: Himachal Pradesh DGP

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిపీడిస్తోంది. మన దేశంలోనూ వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించినా.. కేసులు పెరగడం మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

కరోనా సోకిన రోగులను ఎలా రక్షించాలా అని అటు వైద్యులు, ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. కొందరు కరోనా రోగులు మాత్రం ఎదుటి వారిపై ఉమ్మివేయడం లాంటి పనులు చేస్తున్నారు. అలాంటి పనుల వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

Also Read కరోనా రోగులకు చికిత్స... కన్నీరు పెట్టుకున్న డాక్టర్...

ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ డీజీపీ ఎస్‌ఆర్ మర్ది షాకింగ్ కామెంట్స్ చేశారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఇతరులపై ఉమ్మివేస్తే హత్యాయత్నం కింద కేసు నమోదు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ డీజీపీ ఎస్‌ఆర్ మర్ది హెచ్చరించారు. 

కరోనా రోగి ఉమ్మివేయడం వల్ల ఎవరైనా మరణిస్తే... ఉమ్మివేసిన వ్యక్తిపై హత్యానేరం కింద కేసు పెడతామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ వెళ్లి వచ్చిన వారిలో మరో వ్యక్తికి కోవిడ్-19 సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని డీజీపీ తెలిపారు.  

‘‘నిజాముద్దీన్ మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన మరో ముగ్గురికి కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించాం. ఆ ముగ్గురూ మార్చి 18న ఢిల్లీ నుంచి హెచ్ఆర్టీసీ బస్సుల్లో హిమాచల్ ప్రదేశ్‌కు తిరిగి వచ్చారు. ఆరోజు సాయంత్రం 4గంటల నుంచి 9:30 మధ్య ఈ బస్సుల్లో ప్రయాణించిన వారంతా 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలి..’’ అని డీజీపీ మర్ది పేర్కొన్నారు. 

కాగా నిన్న 12 మంది తబ్లిగి జమాత్ కార్యకర్తలు, వారితో సన్నిహితంగా ఉన్న 52 మంది స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారని డీజీపీ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 13 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఓ వ్యక్తికి వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి కరోనా బారి నుంచి విముక్తి చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios