ఆ ఒక్కటీ చేయండి.. కరోనా సోకి కోలుకున్న మహిళ కామెంట్స్

తాను పనిచేసే ఇంటి యజమాని అమెరికా నుంచి తిరిగి రావడంతో అతని వల్ల తనకు కరోనా సంక్రమించిందని అంజనాబాయి చెప్పారు. కరోనా వచ్చినా ప్రజలు భయపడకుండా ధైర్యంగా ఉంటే అదే నయమవుతుందని అంజనాబాయి పేర్కొన్నారు

mumbai women comments after effected coronavirus

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ పేరు  చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా దాదాపు 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల్లో వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే.. వైరస్ సోకినా.. దాని నుంచి బయటపడ్డారు. అలా వైరస్ నుంచి బయటపడిన ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ప్రజలకు వివరించింది.

Also Read ఇంటికి వెళ్లాలనుందంటూ సింగర్ కనికా కపూర్ ఎమోషనల్ పోస్ట్...

ముంబై నగరంలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో పనిమనిషిగా పనిచేసిన అంజనాబాయికి (65) మార్చి 17వతేదీన కరోనా వైరస్ సోకడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో ఉండి కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అంజనాబాయి తన అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు.

తాను పనిచేసే ఇంటి యజమాని అమెరికా నుంచి తిరిగి రావడంతో అతని వల్ల తనకు కరోనా సంక్రమించిందని అంజనాబాయి చెప్పారు. కరోనా వచ్చినా ప్రజలు భయపడకుండా ధైర్యంగా ఉంటే అదే నయమవుతుందని అంజనాబాయి పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు, వైద్యుల సూచనల ప్రకారం ఇంట్లో ఉండండి, రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దని ఆమె సూచించారు.   ఆసుపత్రిలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తనకు చికిత్సచేశారని, దానివల్లనే తాను కోలుకున్నానని చెప్పారు. ‘‘మీరు ప్రభుత్వ నియమాలను పాటిస్తే, కరోనావైరస్ దగ్గరకు రాదు’’ అని అంజనాబాయి స్పష్టం చేశారు. ‘‘అందరూ ఇళ్లలోనే ఉండండి, జనం రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దు’’ అని ఆమె సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios