ఇంటికి వెళ్లాలనుందంటూ సింగర్ కనికా కపూర్ ఎమోషనల్ పోస్ట్

వరుసగా నాలుగోసారి కూడా కరోనా టెస్టుల్లో పాజిటివ్ గా తేలిన సింగర్ కనికా కపూర్ నిన్న రాత్రి ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్టును పెట్టింది. తాను ఐసీయూలో లేనని, తన మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న వారందరికీ ధన్యవాదాలని ఆమె తెలిపారు. 

Kanika kapoor pens emotional post after testing corona positive for the fourth time

వరుసగా నాలుగోసారి కూడా కరోనా టెస్టుల్లో పాజిటివ్ గా తేలిన సింగర్ కనికా కపూర్ నిన్న రాత్రి ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్టును పెట్టింది. తాను ఐసీయూలో లేనని, తన మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న వారందరికీ ధన్యవాదాలని ఆమె తెలిపారు. 

జీవితం సమయాన్ని ఎలా తెలివిగా వాడుకోవాలో నేర్పిస్తే... మనకు సమయం జీవితం విలువని నేర్పిస్తుంది అనే ఇమేజ్ తో పాటుగా ఒక ఎమోషనల్ పోస్టును జత చేసింది. తాను ఐసీయూ లో లేనని, కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలపడంతో పాటుగా తన తనకు నిర్వహించే తదుపరి పరీక్షలో నెగటివ్ గా రిజల్ట్ రావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. 

తాను ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నానని, తన కుటుంబాన్ని, పిల్లలను చాలా మిస్ అవుతున్నానని తెలిపింది. ఇకపోతే సింగర్ కనికా కపూర్ వరుసగా నాలుగోసారి కూడా కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. 

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరి పాజిటివ్‌గా తేలారు. అప్పటి నుంచి కనికా ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు.

Also Read:యూపీ టు యూకే.. వైరల్ అవుతున్న కనికా, ప్రిన్స్‌ చార్లెస్‌ ఫోటోలు

అయితే 10 రోజులుగా చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్ధితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వైద్యులు నాలుగోసారి చేసిన కరోనా పరీక్షల్లో కూడా కనికా కపూర్‌కు పాజిటివ్‌గా తేలడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇదే సమయంలో ఆమె ట్రీట్‌మెంట్‌కు సైతం స్పందించకపోవడంతో తాము చాలా కంగారు పడుతున్నామని కనికా కుటుంబసభ్యుడు ఒకరు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమెను చికిత్స నిమిత్తం విదేశాలకు కూడా తీసుకెళ్లలేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:ముదురుతున్న కనికా వ్యవహారం.. ఇంక దొరకని ఆమె స్నేహితుడు

కనికా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధించడం తప్పించి ఇంకేమీ చేయలేమని అతను అన్నారు. అయితే వైద్యులు మాత్రం కనికా పరిస్థితి నిలకడగానే ఉందని అంటున్నారు. కాగా మార్చి 9న లండన్ నుంచి ముంబై వచ్చిన కనికా కపూర్ అక్కడి నుంచి కాన్పూర్, లక్నో వెళ్లారు.

అక్కడ ఓ విందులో ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు కనికాను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చేసిన పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. లండన్ నుంచి వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉండకుండా పార్టీలకు హాజరవ్వడం పట్ల మీడియా, ప్రభుత్వం, వైద్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios