ముంబై ఇంకా నవీ ముంబైలోని పోలీసు బలగాలు కరోనా సంక్షోభం వల్ల తలెత్తే ప్రమాదాల నుండి విధి నిర్వహణలో ఉన్న తమ సిబ్బందికి కరోనా వ్యాధి సోకకుండా ఉండడానికి ఒక మంచి పరిష్కారాన్ని తీసుకొచ్చింది.

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి వల్ల ప్రజలు, పోలీసులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విధులలో ఉన్న వారు తమ విధులను నిర్వర్తించేటప్పుడు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్‌ను చట్టాన్ని అమలు చేయడానికి అత్యంత సమర్థవంతంగా పని చేసే వారిలో  పోలీసులు ముందుంటారు.


కానీ స్వీయ సంరక్షణ కూడా వీరికి అవసరం. ముంబై, నవీ ముంబై  పోలీసు దళాలు ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న తమ సిబ్బందికి కరోనా వ్యాధి సోకకుండా చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గంతో ముందుకు వచ్చాయి.

also read   చైనాలో వాటికి ఫుల్ డిమాండ్.. లాక్‌డౌన్ తర్వాత పెరగనున్న కార్ల కొనుగోళ్లు...ఎందుకో తెలుసా ?

పోలీస్ ఫోర్స్‌కు చెందిన కొన్ని వ్యాన్‌లను ఇప్పుడు శానిటైజేషన్ యూనిట్‌లుగా మార్చారు. నగరంలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో శానిటైజేషన్ గదులు కూడా ఏర్పాటు చేసినప్పటికీ, 

పోలీస్ ఫోర్స్‌ తనిఖీలు చేస్తున్న చోట ఈ వ్యాన్లను నగరంలోని పలు పాయింట్లకు తీసుకెళ్లవచ్చు. వారు తమ వీధిలో ఉన్నపుడు అవసరమైనప్పుడల్లా శానిటైజేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం వారు మళ్ళీ పోలీస్ స్టేషన్లలకు వెల్లవలసిన అవసరం ఉండదు.

ఈ వ్యాన్ల ద్వారా పోలీసు సిబ్బంది వీధిలో ఉన్నపుడు రోజుకు కనీసం రెండుసార్లు శానిటైజేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి యూనిట్లను సిద్ధం చేయడంతో పాటు, రహదారులపై  వాహనాల క్లీనింగ్  కూడా కొనసాగుతోంది, నగరంలో అవసరమైన చోట్లలో సరుకుల రవాణా చేస్తున్నారు. వాహనాల డ్రైవర్లకు ఆహారం, ఇతర నిత్యావసరాలను కూడా అందిస్తున్నారు.